పంచాయతీలపై పట్టింపేలా..?

ABN , First Publish Date - 2021-04-19T05:14:53+05:30 IST

గ్రామ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది.

పంచాయతీలపై పట్టింపేలా..?

ఏదీ సర్పంచ్‌లకు సీఎఫ్‌ఎంఎస్‌ సౌకర్యం

బిల్లులు చెల్లించేందుకు కటకట 

జిల్లాలో 5000 మంది  కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై ప్రభావం

వేసవి సాధారణ ఖర్చులకు ఇబ్బందులు

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి): 

గ్రామ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రత్యేక అధికారులను తొలగించి వారి స్థానంలో సర్పంచ్‌లకు, పాలక వర్గాలకు బాధ్యతలు అప్పగించింది. అయినా ఉత్సవ విగ్రహా లుగానే పాలకవర్గాలు మిగిలిపోయాయి. నిధులు వెచ్చిం చేందుకు అవకాశం లేకపోయింది. పంచాయతీల్లో చేపట్టి న పనులకు బిల్లులు చెల్లించాలన్నా.. కాంట్రాక్ట్‌ సిబ్బం దికి వేతనాలు ఇవ్వాలన్నా సరే.. సమగ్ర ఆర్థిక నిర్వ హణ వ్యవస్థ(సీఎఫ్‌ఎంఎస్‌) తప్పనిసరి. సర్పంచ్‌ లకు రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సౌకర్యాన్ని కల్పించాలి. సర్పంచ్‌లకు ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇవ్వాలి. అప్పుడే సర్పం చ్‌లు తమ ఐడీల ద్వారా సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు పెట్టు కోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారులకు బిల్లుల చెల్లింపుల అధికారాలను కట్టబెట్టారు. పల్లె ల్లో సర్పంచ్‌లను ఎన్నుకున్న తర్వాత ప్రత్యేక అధికారుల పాలన తొలగి పోయింది. పాలకవర్గాల పాలన అమలులోకి వచ్చింది. పేరుకే పాలకవర్గాలు. పంచాయతీల్లో దినసరి ఖర్చులను సర్పంచ్‌లు సొంత జేబులనుంచి వెచ్చిస్తు న్నారు. గ్రామ కార్యదర్శులే సర్పంచ్‌ల ఐడీని, పాస్‌వర్డ్‌లను తయా రు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. వాటినే ప్రభుత్వం ఆమోదిస్తుంది. అప్పటి నుంచే బిల్లు పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. దీనివల్ల పంచాయతీల్లో పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, స్వీపర్లు, వాచ్‌మెన్‌లకు వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. జిల్లాలో ఉన్న 928 గ్రామ పంచాయతీల్లో దాదాపు 5000 మంది కాంట్రాక్ట్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. వారంతా వేతనాలు అందక ఇబ్బందులు పడు తున్నారు. 


వేసవిలో ఇబ్బందులు తప్పవా ? 

వేసవిలో తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలంటే అప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. కరోనా మహమ్మారి తరుముకొస్తోంది. పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణకు అదనపు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ సొమ్ములు చెల్లించాలి. సర్పంచ్‌లు ఆ పరిస్థితిలో లేరు. ప్రభుత్వం అధికారికంగా సొమ్ములు వెచ్చించడానికి అవకా శం ఇవ్వలేదు. ఫిబ్రవరిలో ఎన్నికైన సర్పంచ్‌లకు అప్పట్లో ఆర్థిక సంఘం నిధులు పుష్కలంగా ఉన్న సమయంలో బాధ్యతలు అప్పగిస్తే అభివృద్ధి పనులు నిర్వహించేలా చర్యలు చేపట్టేవారు. ప్రత్యేక అధికారులతోనే ఆర్థిక సంఘం నిధులు వెచ్చించారు. పంచాయతీల్లో సాధారణ నిధులకు ఇప్పుడు అవకాశం కల్పించకపోవడంపై సర్పంచ్‌లంతా గుర్రుగా ఉన్నారు. పంచాయతీల్లో పాలన లేకుండా పోయిం ది. ఆర్థిక అవసరాలను తీర్చుకోలేని ఇబ్బందికర పరిస్థితుల్లో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. 


ఉద్దేశ పూర్వకంగానే జాప్యం

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ అధికారాలను తొక్కి పెడుతోంది. అందులో భాగంగానే గ్రామ సచివాలయాలను రెవెన్యూ పరిధిలోకి తీసుకువెళ్లింది. ఇప్పుడు తమకు నిధులు వెచ్చించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. గ్రామ పంచాయతీలను బలహీనపరచి, అధికారాన్ని తమ గప్పిట్టో ఉంచుకోవాలన్న దురుద్దేశం ప్రభుత్వంలో కనిపిస్తోంది. 

– పోతుల అన్నవరం, సర్పంచ్‌, పెదతాడేపల్లి 


తక్షణమే సీఎఫ్‌ఎంఎస్‌ సౌకర్యం కల్పించాలి

వేసవిలో చేపట్టాల్సిన పనులు అనేకం ఉన్నాయి. ఫిబ్రవరిలో పాలకవర్గాలు ఎన్నికైతే ఇప్పటివరకు సీఎఫ్‌ఎంఎస్‌ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. తక్షణమే బిల్లులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించాలి. లేదంటే వేసవిలో ప్రజలు ఇబ్బంది పడనున్నారు. 

– బి.సింధు, సర్పంచ్‌, ఉంగుటూరు

Updated Date - 2021-04-19T05:14:53+05:30 IST