కోరం లేక

ABN , First Publish Date - 2021-03-04T06:59:22+05:30 IST

జిల్లాలో నాలుగు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవులు ఎన్నిక ద్వారా ముగియగా, మెజార్టీ వార్డు సభ్యుల కోరం లేక కొన్నిచోట్ల ఉపసర్పంచ్‌ పదవుల భర్తీ నిలిచిపోయింది.

కోరం లేక

 పంచాయతీల్లో నిలిచిన ఉపసర్పంచ్‌ పదవులు 

 నాలుగు విడతల ఎన్నికల్లో  మొత్తం 56 పెండింగ్‌లో 

  గడువులోగా బల నిరూపణ చేయకుంటే మెజార్టీ వార్డు సభ్యుల ఆమోదంతో 

ఆయా పంచాయతీల్లో ఉపసర్పంచ్‌లను ఖరారు చేసే అవకాశం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) జిల్లాలో నాలుగు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవులు ఎన్నిక ద్వారా ముగియగా, మెజార్టీ వార్డు సభ్యుల కోరం లేక కొన్నిచోట్ల ఉపసర్పంచ్‌ పదవుల భర్తీ నిలిచిపోయింది. ఇప్పటికే పాలకవర్గాలు కొలువు తీరగా, కొన్ని పంచాయతీల్లో ఉప సర్పంచ్‌లు లేనిలోటు కనిపిస్తోంది. అయితే వార్డు సభ్యులు నేరుగా ఎన్నుకునే ఈ పదవులకు పలువురు వార్డు సభ్యులు సహకరించకపోవడం, పదవి తనకు కావాలంటే, తనకు కావాలనడంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఏకా భిప్రాయానికి వచ్చి ఒక సభ్యుడిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకోవాలని పరోక్షంగా మద్దతిచ్చిన వివిద రాజకీయ పార్టీల నేతలు రంగంలోకి దిగి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దీంతో ఈ ప్రక్రియ జాప్యం అవుతోంది. అయితే గడువులోగా ఉపసర్పంచ్‌ పదవులకు వార్డు సభ్యు లు పంచాయతీల్లో హాజరయ్యి కోరం మేరకు ఒక సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంది. అనుకున్న సమయంలో బల నిరూపణ చేయకపోతే పంచాయతీరాజ్‌ చట్టం మేరకు మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఆయా పంచాయతీల్లో ఉప సర్పంచ్‌లను ఖరారు చేయడానికి జిల్లా పంచాయతీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 


ఎక్కడెక్కడ... ఎలాగంటే... 


 మొదటి విడతలో కాకినాడ రూరల్‌ మండలంలో పెనుమర్తి, యు కొత్తపల్లి మండలంలో శ్రీరాంపురం, ఉప్పాడ, సామర్లకోట మండలంలో అచ్చంపేట, కాపవరం, తాళ్లరేవు మండలంలో గాడిమొగ, ఇం జరం, కోరంగి, పిఠాపురం మండలంలో ఎల్‌ఎన్‌ పురం, జములపల్లి, కందరాడ, గండేపల్లి మండలంలో ఉప్పలపాడు, జగ్గంపేట మండలంలో గోవిందపురం, కిర్లంపూడి మండలంలో వీరవరం, ప్రత్తిపాడు మండలంలో పోతులూరు, యూజే పురం, ఉత్తరకంచి, రంగపేట మం డలంలో జి దొంతమూరు, శంఖవరం మండలంలో నెల్లిపూడి, తొండం గి మండలంలో ఏ కొత్తపల్లి, వేమవరం, కె పెరుమాళ్లపురం, ఒంటిమామిడి, కిష్ణపురం, 26 పంచాయతీల్లో ఉపసర్పంచ్‌లు కొలిక్కి రాలేదు. 

  రెండో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కె గంగవరం మం డలం కూళ్ల, బిక్కవోలు మండలంలో ఊలపల్లి, రామచంద్రపురం మండలంలో బాపనయ్య చెరువు, నేలపర్తిపాడు, వేగయమ్మపేట, ఏరు పల్లి, అదివారపుపేట, మండపేట మండలంలో మారేడుబాక, మేర్నిపాడు, కపిలేశ్వరపురం మండలంలో కపిలేశ్వరపురం, గోకవరం మండలంలో గుమ్మళ్లదొడ్డి, కామరాజుపేట, కృష్ణునిపాలెం, తంటికొండ, రాజానగరం మండలంలో రామేశంపేట, మల్లంపూడి, ఆలమూరు మండలం లో పెనికేరు, చెముడులంక. మొత్తం 18 పంచాయతీల్లో సదరు పదవులు అడకత్తెరలో పోక చెక్కలా తర్జనభర్జనలో ఉన్నాయి. 

  మూడో విడతలో దేవీపట్నం మండలంలో ఇందుకూరు,పూడిపల్లి, ఏ గంగవరం మండలంలో నెల్లిపూడి. మొత్తం 3 గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్‌ పదవికి పోటీ నెలకొంది.  నాల్గో విడత ఎన్నికల్లో అల్లవరం మండలం బోడసకుర్రు, డి రావులపాలెం, ఐ పోలవరం మండలంలో జి మూలపాలెం, కాట్రేనికోన మండలంలో బ్రహ్మసమేథ్యం, మల్కిపురం మండలంలో లక్కవరం, పి గన్నవరం మండలంలో పి గన్నవరం, రావులపాలెం మండలంలో ఈతకోట, ముమ్మిడివరప్పాడు, సఖినేటిపల్లి మండలంలో శృంగవరప్పాడు.. మొత్తం 9 పంచాయతీల్లో ఉపసర్పంచ్‌ పదవులు తేలలేదు.

Updated Date - 2021-03-04T06:59:22+05:30 IST