పంచాయతీకి రూ.2 లక్షల చొప్పున కేటాయించాలి

ABN , First Publish Date - 2022-08-14T06:06:31+05:30 IST

గ్రామాల్లో మెరుగైన వి ద్యుత సరఫరా కోసం ప్ర తీ గ్రామ పంచాయతీకి రూ.2లక్షల చొప్పున కేటాయించాలని ఎంపీపీ క రీంపాష అన్నారు.

పంచాయతీకి రూ.2 లక్షల చొప్పున కేటాయించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ కరీంపాష

కనగల్‌, ఆగస్టు 13: గ్రామాల్లో మెరుగైన వి ద్యుత సరఫరా కోసం ప్ర తీ గ్రామ పంచాయతీకి రూ.2లక్షల చొప్పున కేటాయించాలని ఎంపీపీ క రీంపాష అన్నారు. శనివా రం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన స ర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఐబీ తదితర శాఖలకు చెందిన అధికారులు సమయపాలన పాటించటం లేదని, వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సమావేశంలో వాపోయారు. విధుల పట్ల అలసత్వం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో సీ జనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు స ర్పంచులు, ఎంపీటీసీలు కోరారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములను చేయాలని ఎంపీపీ కరీంపాష కోరారు. సమావేశంలో జడ్పీటీసీ చిట్లవెంకటేశంగౌడ్‌, ఎంపీడీవో సోమసుందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ రామగిరి శ్రీధర్‌రావ్‌, సింగిల్‌విండో చైర్మన్లు సహదేవరెడ్డి, శ్రీనివాస్‌, వెటర్నరీ డాక్టర్‌ బాబు, ఏవో అమరేందర్‌గౌడ్‌, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-14T06:06:31+05:30 IST