ప్రకాశం: సచివాలయంలో పనిచేస్తున్న వలంటీర్‌పై పంచాయతీ కార్యదర్శి బూతుపురాణం అందుకున్నాడు. మర్రిపూడి మండలం కెల్లంపల్లి పంచాయతీ కార్యదర్శి రహమత్ బాషా, వలంటీర్లపై అతిగా ప్రవర్తించాడు. సచివాలయ కార్యాలయంలోనే వెల్ఫేర్ అసిస్టెంట్ సతీష్‌పై రహమత్ బాషా బూతుపురాణం అందుకున్నాడు. అవసరమైన స్టేషనరీ ఇవ్వాలని అడిగినందుకు నన్నే అడుగుతావా అంటూ కార్యాలయంలోనే రహమత్ బాషా రెచ్చిపోయాడు. రహమత్ బాషా ప్రవర్తనకు ఇతర సిబ్బంది నిర్ఘాంతపోయారు. ప్రతీరోజు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహమత్ బాషా వ్యవహారంపై ఉన్నతాధికారులకు సచివాలయ సిబ్బంది ఫిర్యాదు చేసారు. అయితే గతంలో పలుమార్లు రహమత్ బాషాపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఘటనపై విచారణ చేపట్టాలని సచివాలయ సిబ్బంది డిమాండ్ చేసారు.