Panchayat funds.. ఏపీలో పంచాయతీ నిధులు మాయం...

ABN , First Publish Date - 2022-09-03T16:52:21+05:30 IST

ఏపీ (AP)లో పంచాయతీ నిధులు (Panchayat funds) మాయమైపోతున్నాయి.

Panchayat funds.. ఏపీలో పంచాయతీ నిధులు మాయం...

విజయవాడ (Vijayawada): ఏపీ (AP)లో పంచాయతీ నిధులు (Panchayat funds) మాయమైపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెబుతున్న రూ. 569 కోట్ల ఆర్థిక సంఘ నిధులు ఎక్కడని పంచాయతీ సర్పంచ్‌లు (Sarpanches) ఆరా తీస్తున్నారు. కరెంట్ బిల్లుల బకాయిల రూపంలో పంచాయతీలకు వస్తున్న నిధులను నొక్కేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను కూడా అలా మింగేసిందేమోనని సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులను పంచాయతీలు ఓపెన్ చేసిన ప్రత్యేక అకౌంట్లలో జమ చేయాలని ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు తెరిపించారు. ఈ అకౌంట్లలో కేంద్రం నుంచి వచ్చే నిధులను జమ చేయాల్సి ఉంది. కానీ ఇంత వరకు నిధులు జమ కాలేదు. 


పంచాయతీల్లో తాగునీటి సరఫరా, వాననీటి సంరక్షణ, మురుగునీటి పునర్ వినియోగానికి సుమారు రూ. 569 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇందులో 60 శాతం నిధులు తాము సూచించిన అంశాలకు, మిగిలిన 40 శాతం నిధులు స్థానిక అవసరాలను తెలుసుకుని కేటాయించుకోవచ్చునని కేంద్రం సూచించింది. అయితే కేంద్రం నిధులను విడుదల చేసినట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ నేటి వరకు పంచాయతీలకు జమ కాలేదు. పది రోజుల్లోగా స్థానిక సంస్థలకు ఈ నిధులు విడుదల చేయాలని లేని పక్షంలో వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది.

Updated Date - 2022-09-03T16:52:21+05:30 IST