ప్రేక్షకులు మెచ్చే పంచనామా

త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, ముక్కు అవినాష్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రానికి ‘పంచనామా’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. సిగటపు రమే్‌షనాయుడు దర్శకత్వంలో గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మిస్తున్నారు. ఇటీవల నిర్మాత దిల్‌రాజు సినిమా టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘నా మీద నమ్మకంతో నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. కొత్తదనమున్న సినిమా ఇది’ అన్నారు.  

Advertisement