మీ ఊళ్ళకు వచ్చే ప్రయాణికుల వివరాలు చెప్పండి : పంచకుల సీఎంఓ

ABN , First Publish Date - 2020-05-29T20:25:30+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న

మీ ఊళ్ళకు వచ్చే ప్రయాణికుల వివరాలు చెప్పండి : పంచకుల సీఎంఓ

చండీగఢ్ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. ప్రైవేటు వాహనాలు, ఆటోలు, రైళ్ళు, బస్సులు, ట్యాక్సీలు, విమానాల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్ళకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 కూడా కొందరితో పాటు వెళ్తోంది. 


ప్రజలు ప్రయాణాలు చేస్తుండటంతో ప్రయాణికులను గుర్తించి, కోవిడ్-19 కోసం నిఘా పెట్టేందుకు పంచకుల జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఊళ్ళలోకి, కాలనీల్లోకి వస్తున్నవారిని గుర్తించి, ఏ రోజుకు ఆ రోజు సమాచారం అందజేయాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను పంచకుల చీఫ్ మెడికల్ ఆఫీసర్ కోరారు. 


అష్ట దిగ్బంధనం నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారని, ఆటోలు, రైళ్ళు, బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు, విమానాల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి పంచకులకు చేరుకుంటున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఇటువంటి ప్రయాణికుల వివరాలను  ఏ రోజుకు ఆ రోజు సమాచారం అందజేయాలని కోరారు. 


ఈ సమాచారం పంచకులకు వచ్చేవారిని గుర్తించి, నిఘా పెట్టేందుకు ఉపయోగపడుతుందని, ముఖ్యంగా హై రిస్క్ ఏరియాల నుంచి వస్తున్నవారిపై నిఘా పెట్టడానికి వీలవుతుందని తెలిపారు.


Updated Date - 2020-05-29T20:25:30+05:30 IST