నగదు ఉపసంహరణలు, డిపాజిట్లకు... పాన్, ఆధార్ తప్పనిసరి... రేపటినుంచి అమల్లోకి

ABN , First Publish Date - 2022-05-25T22:41:07+05:30 IST

రూ. 20 లక్షల కంటే ఎక్కువ నగదును విత్‌డ్రా చేయడం, లేదా... డిపాజిట్ చేయడానికి సంబంధించి... ఇక పాన్, ఆధార్ తప్పనిసపరయ్యాయి.

నగదు ఉపసంహరణలు, డిపాజిట్లకు...  పాన్, ఆధార్ తప్పనిసరి... రేపటినుంచి అమల్లోకి

ముంబై : రూ. 20 లక్షల కంటే ఎక్కువ నగదును విత్‌డ్రా చేయడం,  లేదా... డిపాజిట్ చేయడానికి సంబంధించి... ఇక పాన్, ఆధార్ తప్పనిసపరయ్యాయి. రేపటి నుంచి(26 మే, 2022 గురువారం) ఇది అమ ల్లోకి రానుంది. ఇక... ఒక ఆర్థిక సంవత్సరంలో సహకార బ్యాంకులు, పోస్టాఫీసులు సహా బ్యాంకు ఖాతాల నుండి రూ. 20 లక్షల కంటే ఎక్కువ డ్రా చేసినా, కరెంట్ ఖాతా తెరిచే సమయంలో కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(cbdt) ఈ నెల ప్రారంభంలో ఒక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. గతంలో ఒక్క రోజులో రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసే సమయంలో మాత్రమే పాన్ కార్డ్ అవసరముండేది. అయితే రూల్ 114 బి ప్రకారం నగదు డిపాజిట్, లేదా... ఉపసంహరణకు వార్షిక పరిమితి లేదు. ఇది కాకుండా, బ్యాంకులో చేసిన డిపాజిట్‌పై మాత్రమే పరిమితి వర్తిస్తుంది. 

Updated Date - 2022-05-25T22:41:07+05:30 IST