పమిడిపాడులో ఇళ్ల స్థలాల విషయమై వివాదం

ABN , First Publish Date - 2020-08-08T10:15:04+05:30 IST

మండలంలోని పమిడిపాడులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం స్థల సేకరణ విషయమై వివాదం ..

పమిడిపాడులో ఇళ్ల స్థలాల విషయమై వివాదం

అభిప్రాయ సేకరణ సమావేశం రసాభాస


మేదరమెట్ల, ఆగస్టు7 : మండలంలోని పమిడిపాడులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం స్థల సేకరణ విషయమై వివాదం నెలకొంది.  శుక్రవారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ మెహతాజ్‌ ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. వైసీపీలోని రెండు వర్గాల వారు అధికారుల ఎదుట వాగ్వివాదానికి దిగారు.


రాచపూడి రోడ్డులో అధికారులు చెప్పిన స్థలం పక్కన సమాధుల, శ్మశానాలు ఉన్న దృష్ట్యా అక్కడ వద్దంటూ కొందరు, కావాలంటూ మరికొందరు భీష్మించారు. కనగాలవారిపాలెం రోడ్డులోని పెట్రోల్‌ పంపు పక్కన ఉన్న స్థలం కేటాయించాలని కొందరు కోరారు. అయితే అక్కడ పొలం ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతుల్లో కొందరు స్పందించలేదని ఇన్‌చార్జి తహసీల్దార్‌ మెహతాజ్‌ అన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఆమె తెలిపారు.   

Updated Date - 2020-08-08T10:15:04+05:30 IST