Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 21 Jan 2022 22:28:24 IST

5వ భర్త, తన మాజీ బాడీగార్డ్ నుంచీ Divorce కావాలంటోన్న నటి!

twitter-iconwatsapp-iconfb-icon
5వ భర్త, తన మాజీ బాడీగార్డ్ నుంచీ Divorce కావాలంటోన్న నటి!

మొన్న చే అండ్ సామ్, నిన్న ధనుష్ అండ్ ఐశ్వర్య... విడాకులు కేవలం టాలీవుడ్, కోలీవుడ్‌కే పరిమితం అనుకుంటున్నారా? డైవోర్స్ రేసులో హాలీవుడ్‌ ఎప్పుడూ ముందే ఉంటుంది! తాజాగా ఓ హాట్ హాలీవుడ్ స్టార్ తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిందట... 

5వ భర్త, తన మాజీ బాడీగార్డ్ నుంచీ Divorce కావాలంటోన్న నటి!

పమేలా అండర్సన్... ఈమె గురించి తెలిసిన వారు దేశదేశాల్లో చాలా మందే ఉంటారు. అంతటి హాట్ అండ్ సెన్సేషనల్ సుందరి. అయితే, ఇప్పటికే పలు పెళ్లిల్లు చేసుకున్న బోల్డ్ బ్యూటీ లెటెస్ట్‌గా తన 5వ భర్త నుంచీ కూడా విడాకులు కోరుతోందట. అయితే, అతను ఆమె మాజీ బాడీగార్డ్ కావటం మరింత విశేషం!


పమేలా తన ఎక్స్ బాడీగార్డ్ డాన్ హేహర్స్ట్‌ని 2020వ సంవత్సరం, క్రిస్మస్ వేళ పెళ్లాడింది. వారిద్దరి మధ్యా ప్రేమ చిగురించి క్రమంగా డేటింగ్‌కి దారి తీయటంతో ట్రెడిషనల్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. కానీ, 2021 ఇలా ముగిసిందో లేదో అప్పుడే 2022లో పమేలా డైవోర్స్ బాట పట్టింది. అతి కష్టంగా ఫస్ట్ యానివర్సరీ ముగించి న్యాయస్థానం మెట్లెక్కేసింది. ఇదే విషయాన్ని ఆమె అధికార ప్రతినిధి కూడా అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేసేశాడు! 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International