Kuwait: వీసా బదిలీపై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2022-08-28T19:04:43+05:30 IST

నిషేధించబడిన కంపెనీల కింద ఉన్న కార్మికుల రెసిడెన్సీని కొత్త సంస్థలకు బదిలీ చేసుకోవడానికి అనుమతించినట్లు ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్తలపై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (PAM) తాజాగా స్పందించింది.

Kuwait: వీసా బదిలీపై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఏం చెప్పిందంటే..

కువైత్ సిటీ: నిషేధించబడిన కంపెనీల కింద ఉన్న కార్మికుల రెసిడెన్సీని కొత్త సంస్థలకు బదిలీ చేసుకోవడానికి అనుమతించినట్లు ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్తలపై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (PAM) తాజాగా స్పందించింది. కార్మిక చట్టం విషయంలో జారీ చేసిన నిబంధనలు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయని తెలియజేసింది. ప్రధానంగా బదిలీకి సంబంధించిన పరిపాలన నిర్ణయం నం 842/2015 కొత్త యజమానికి, ఉద్యోగికి సంబంధించిన సవరణలను ఈ సందర్భంగా గుర్తు చేసింది. కార్మిక చట్టంలో ఉన్న ఆర్టికల్స్‌లోని అంశాలు, నిబంధనలు, సవరణలు రెసిడెన్సీ బదిలీకి సంబంధించి ప్రచారంలో ఉన్న వార్తలలో ఎటువంటి సమాచారం లేదని మ్యాన్ పవర్ అథారిటీ వెల్లడించింది. 


ఇదిలాఉంటే.. మూసివేయబడిన లేదా ఉనికిలో లేని సంస్థల కోసం రిక్రూట్ చేయబడిన ప్రవాస కార్మికులు ఇప్పుడు వారి రెసిడెన్సీ వీసాలను (Residency Visa) తగిన విధానాల ద్వారా బదిలీ చేసుకోవచ్చని కువైత్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. దేశంలోకి ప్రవేశించిన తర్వాత కంపెనీల చేతిలో మోసపోయి ఫైళ్లు మూతపడ్డ వందలాది మందికి, తమ తప్పేమీ లేదని నిరూపించుకునే అవకాశం ఈ కొత్త నిర్ణయం ద్వారా కలుగుతుందనేది ఆ వార్తల సారాంశం. దీనిపైనే ఇప్పుడు పీఏఎం వివరణ ఇచ్చింది.   

Updated Date - 2022-08-28T19:04:43+05:30 IST