వేప చెట్టు నుంచి కారుతున్న కల్లు.. మూడ్రోజులుగా ఆగని ధార..

ABN , First Publish Date - 2020-02-10T23:16:58+05:30 IST

ఈత చెట్టుకో.. తాటి చెట్టుకో కల్లు రావడం సహజం.. కానీ వేపచెట్టుకు కల్లు ధారలు ధారలుగా కారడం మీరెక్కడయినా చూశారా..?

వేప చెట్టు నుంచి కారుతున్న కల్లు.. మూడ్రోజులుగా ఆగని ధార..

తిలకించేందుకు ఎగబడుతున్న జనం

కళ్లకు వేప కల్లు మంచిదని సీసాల్లో పట్టుకుంటున్న వైనం


అల్లాదుర్గం (మెదక్ జిల్లా): ఈత చెట్టుకో.. తాటి చెట్టుకో కల్లు రావడం సహజం.. కానీ వేపచెట్టుకు కల్లు ధారలు ధారలుగా కారడం మీరెక్కడయినా చూశారా..? మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలంలోని చేవెళ్ల గ్రామంలో ఈ అద్భుతం జరిగింది.. ఎక్కడా కనపడని వింత కాబట్టే... జనం కూడా దీన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. చెట్టు పై భాగాన ఉన్నట్టుండి రంధ్రం పడటంతో.. మూడు రోజులుగా కల్లు ధారలా కారుతోంది. ఇది తెలిసి ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా వేప కల్లు ఆరోగ్యానికి మంచిదనీ.. అనేక రోగాలు నయమవుతాయని, కళ్ల సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటూ.. కొందరు ఆ కల్లును సీసాల్లో పట్టుకుపోతున్నారు. ఇలాంటి వింత ఘటనను ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెప్పుకుంటున్నారు.

Updated Date - 2020-02-10T23:16:58+05:30 IST