పామాయిల్‌ రైతులకు నష్టం జరిగితే సహించేదిలేదు

ABN , First Publish Date - 2021-10-20T05:13:40+05:30 IST

పామాయిల్‌ రైతులకు నష్టం జరిగితే ఉపేక్షించేది లేదని ఆయిల్‌పెడ్‌, ప్రైవేటు కంపెనీల అధికారులను మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీవ్రంగా మందలించారు. కొద్దిరోజులుగా ఆయిల్‌ఫెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్యాలపై పత్రికల్లో వస్తున్న కథనాలపై వారు తీవ్రంగా స్పందించారు. పామాయిల్‌ రైతులకు నష్టం జరిగితే ఉపేక్షించేది లేదని ఆయిల్‌పెడ్‌, ప్రైవేటు కంపెనీల అధికారులను మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీవ్రంగా మందలించారు.

పామాయిల్‌ రైతులకు నష్టం జరిగితే సహించేదిలేదు

రికవరీ రేటుపై అపోహలు తొలిగించాలి

కలెక్షన్‌ ఏజెంట్లను ప్రోత్సహించవద్దు

అధికారులతో మాజీమంత్రి తుమ్మల, ఎమ్మెల్యే మెచ్చా

అయిల్‌ఫెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్యాలకు మందలింపు

దమ్మపేట, అక్టోబర్‌ 19: పామాయిల్‌ రైతులకు నష్టం జరిగితే ఉపేక్షించేది లేదని ఆయిల్‌పెడ్‌, ప్రైవేటు కంపెనీల అధికారులను మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీవ్రంగా మందలించారు. కొద్దిరోజులుగా ఆయిల్‌ఫెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్యాలపై పత్రికల్లో వస్తున్న కథనాలపై వారు తీవ్రంగా స్పందించారు. పామాయిల్‌ రైతులకు నష్టం జరిగితే ఉపేక్షించేది లేదని ఆయిల్‌పెడ్‌, ప్రైవేటు కంపెనీల అధికారులను మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీవ్రంగా మందలించారు. కొద్దిరోజులుగా ఆయిల్‌ఫెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్యాలపై పత్రికల్లో వస్తున్న కథనాలపై వారు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు మంగళవారం దమ్మపేట మండలం అల్లిపల్లిలోని పామాయిల్‌ వ్యవసాయ క్షేత్రం వద్ద ఆయిల్‌పెడ్‌, గోద్రెజ్‌ కంపెనీ అధికారులతో మాట్లాడారు. ఫ్యాక్టరీల పనితీరు బాగాలేదని మందలించారు. ఆయిల్‌ఫెడ్‌లో ఇంకా చిన్నచిన్న లోపాలతో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, సరిహద్దులో ఉన్న ప్రైవేట్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం తీరు బాగాలేదని తుమ్మల పేర్కొన్నారు. ఈ ఈ రెండు యాజమాన్యాల మధ్య ప్రస్తుతం అనారోగ్యకరమైన పోటీ ఉందని, దానివల్ల రైతులకు నష్టం జరుగుతోందని తప్పుపట్టారు. ఎవరి పరిధిలో వారు మాత్రమే పామాయిల్‌ గెలలను కొనుగోలు చేయాలని సూచించారు. కలెక్షన్‌ ఏజెంట్లు, దళారుల వల్ల రైతులకు తీవ్రనష్టం జరుగుతోందని,  యాజమాన్యాలు అలాంటి వారిని ప్రోత్సహించవద్దన్నారు. ఈ రకమైన చర్యల వల్ల ఓఈఆర్‌(ఆయిల్‌ రికవరీరేట్‌)పై ప్రభావం పడి రెండు రాష్ర్టాల రైతులకు నష్టం జరుగుతోందన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్యాక్టరీల మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న విషయాన్ని యాజమాన్యాలు గమనించాలన్నారు. 35 సంవత్సరాల క్రితం ఎన్‌టీఆర్‌ ప్రోత్సాహంతో పామాయిల్‌ సాగు ప్రారంభమైందని, రైతుల ఆనాటి కష్టానికి ఇప్పడు ఫలాలు అందుతున్నాయన్నారు. పామాయి సాగు పట్ల రైతుల్లో సానుకూలత ఏర్పడుతున్న తరుణంలో చిన్నచిన్న లోపాలతో యాజమాన్యాలు రైతులను నష్టపరిచేలా వ్యవరించడం ఆందోళన కలిగిస్తోందని మందలించారు. పామాయిల్‌పై కొందరు సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టి రైతులకు నష్టం కలిగేలా వ్యవరిస్తున్నారన్నారు. తప్పులు జరిగితే అధికారులు స్పందించాలని, రైతులు, సంఘాల నాయకులు సమన్వయంతో సమస్య పరిష్కరించుకోవాలని హితువు పలికారు. చిన్న చిన్న తప్పులతో ఆయిల్‌పెడ్‌ను బద్నాం చేయవద్దన్నారు. కేసీఆర్‌ సహకారంతో అధునాతనమైన ప్యాక్టరీని నిర్మించటంవల్ల రైతులకు అత్యధిక ధర వస్తోందన్నారు. రైతుల్లో అపోహలకు తావిస్తున్న కౌలు, నకిలీ ఎఫ్‌ఎఫ్‌బీ కార్డులు తొలింగించాలని సూచించారు. రాష్ర్టానికి అశ్వారావుపేట, దమ్మపేట మండలాలు పామాయిల్‌ క్షేత్రాలకు దిక్సూచిగా, అవగాహన కేంద్రాలుగా మారాయని తుమ్మల పేర్కొన్నారు. రైతులకు పామాయిల్‌ మొక్కల కొరత రాకుండా చూడాలన్నారు. జనవరి నాటికి రైతులందరికీ మొక్కలు అందించాలన్నారు. సమస్యలు ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ తుమ్మల సూచనలు, సలహలతో సమస్యలు పరిష్కరించుకొని ముందుకు వెళతామన్నారు. సమావేశంలో టీఎస్‌ ఆయిల్‌పెడ్‌, ఎండీ సరేంద్ర, జీఎం సుధాకర్‌రెడ్డి, పామాయిల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్లపాటి రామచంద్రప్రసాద్‌, మేనేజర్లు శ్రీకాంతరెడ్డి, బాలకృష్ణ, గోద్రేజ్‌ కంపెనీ ఎండీ చావా వెంకటేశ్వరరావు, సీఈవో సూరి, పైడి వెంకటేశ్వరరావు, సీమకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T05:13:40+05:30 IST