పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం

ABN , First Publish Date - 2022-01-25T02:39:18+05:30 IST

మండలంలోని గ్రామాల్లో ఒక వైపు పారిశుధ్య లోపం, మరో వైపు విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పారిశు

పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం
రాజుపాళెంలోని డ్రైనేజీ కాలువలో నిల్వ ఉన్న మురికినీరు

 ప్రబలుతున్న విషజ్వరాలు 

 చోద్యం చూస్తున్న అధికారులు

కొడవలూరు జనవరి 24 : మండలంలోని గ్రామాల్లో ఒక వైపు పారిశుధ్య లోపం, మరో వైపు విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పారిశుధ్యం కోసం అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.  కాలువల్లో మురుగునీరు పోయే వీలు లేకుండా పోయింది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా విషజ్వరాలు  ప్రబలి, ప్రజలు  ప్రైవేటు వైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మండలంలోని కొడవలూరు, దామేగుంట, తలమంచి, రామన్నపాలెం, యల్లాయపాలెం, రేగడిచెలిక, పెయ్యలపాలెం , కొత్తవంగల్లు, ఆలూరుపాడు, రెడ్డిపాలెం, తదితర గ్రామాల్లో పారిశుఽధ్యం పూర్తిగా పడకేసింది. అధికారులు వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలి. 


 గ్రామాల్లో జ్వరాలు... బెంబేలెత్తుతున్న జనం


పొదలకూరు, జనవరి 24 : మూడు రోజులుగా మంచు కమ్మేస్తోంది. ఉదయం 9 దాటినా చలి తగ్గడం లేదు. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ముందు జలుబు, దగ్గు వచ్చి ఒకట్రెండు రోజులు తగ్గి తర్వాత జ్వరంగా మారుతోందని చెబుతున్నారు. పొదలకూరు తోపాటు చెన్నారెడ్డిపల్లి, ముదిగేడు, ఇనుకుర్తి, మొగళ్లూరు, తదితర ప్రాంతాల్లో జ్వర పీడితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మండలంలోని ప్రతి ఐదుగురిలో ఇద్దరు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో ఆసుపత్రులకు వెళ్తున్నారు. కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో మూడు రోజులకు మించి జ్వరం ఉన్నవారు భయాందోళనలకు గురవుతున్నారు. వారం రోజులుగా మండలంలో సుమారు వంద మందికిపైగా కొవిడ్‌ బారినపడి స్వల్ప లక్షణాలతో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే రకరకాల టెస్టులతో వేలాది రూపాయలు గుంజుతు న్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 



--------------


Updated Date - 2022-01-25T02:39:18+05:30 IST