Jc Prabhakar Reddyపై పల్లె రఘునాథ్‌రెడ్డి విమర్శలు

ABN , First Publish Date - 2022-05-14T00:17:25+05:30 IST

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి (Palle Raghunatha Reddy) తీవ్రమైన విమర్శలు చేశారు.

Jc Prabhakar Reddyపై పల్లె రఘునాథ్‌రెడ్డి విమర్శలు

శ్రీసత్యసాయి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి (Palle Raghunatha Reddy) తీవ్రమైన విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో జేసీ తల దూరిస్తే ఊరుకోనని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో కార్యకర్తల కష్టసుఖాలు తాను చూసుకుంటానని తెలిపారు. టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలోకి వచ్చి జేసీ ప్రభాకర్‌రెడ్డి చిచ్చు రేపుతున్నారని మండిపడ్డారు. సమస్య ఏదైనా ఉంటే తనతో చర్చించాలని సూచించారు. ఉజ్వల భూకబ్జాల అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. న్యాయం జరగకపోతే పోరాటం చేస్తానని పల్లె రఘునాథ్‌రెడ్డి ప్రశ్నించారు.

Read more