palle pragati పల్లెప్రగతి పై మంత్రి ఎర్రెబెల్లి సమావేశం

ABN , First Publish Date - 2022-05-11T21:54:00+05:30 IST

పల్లె ప్రగతి 5వ విడత కార్యాచరణ ప్రణాళిక పై రాష్ట్రంలోని అందరు డీపీఓ లు, డి అర్ డి ఓ లతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) సమావేశం నిర్వహించారు.

palle pragati పల్లెప్రగతి పై మంత్రి ఎర్రెబెల్లి సమావేశం

హైదరాబాద్: పల్లె ప్రగతి 5వ విడత కార్యాచరణ ప్రణాళిక పై రాష్ట్రంలోని అందరు డీపీఓ లు, డి అర్ డి ఓ లతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) సమావేశం నిర్వహించారు.రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ని టీ ఎస్ ఐ ఆర్ డి కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఈ సమీక్ష సమావేశం పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు, 5వ విడత సాధించాల్సిన లక్ష్యాల పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


ఈ సమీక్షలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీపీ ఓ లు, డి అర్ డి ఓ కు పాల్గొంటున్నారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పెద్దయెత్తున అభివ`ద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంతో పల్లెల రూపురేఖలే మారిపోయాయన్నారు. ఐదో విడతలో కూడా పల్లె సీమలను మరింత సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి తెలిపారు. 

Read more