టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాల ఏడుపు

ABN , First Publish Date - 2021-12-13T21:46:56+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ పురోగతినిచూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాల ఏడుపు

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ పురోగతినిచూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని చూడలేక ప్రగతినిరోధులుగా తయారయ్యారని ఆయన ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం పల్లా రాజేశ్వరరెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయే వరకు మేం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతుల శ్రేయస్సును కోరుకునే పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. రైతుల కోసం  రూ.50 వేల కోట్ల నిధులు వారి ఖాతాల్లో డైరెక్ట్‌గా వేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌దని అన్నారు.


తెలంగాణ అభివృద్ధి దేశం అంతా కనిపిస్తున్నాఇక్కడి కళ్లులేని కబోదులైన ప్రతిపక్షాలకు మాత్రం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగు విస్తీర్ణం 51 శాతం పెరిగిందని,రాష్ట్రంలో అధికారికంగా 2లక్షలు, అనధికారికంగా 4లక్షల బోర్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాన్నామని పల్లా పేర్కొన్నారు. 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు, 2020-21లో 141 మెట్రిక్ టన్నులు ఎఫ్సీఐ కి తెలంగాణ ఇచ్చిందన్నారు. 42లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరణ చేసిందన్నారు. బీజేపీ నాయకులను కళ్లాల దగ్గర రైతులు అడ్డుకుంటే గవర్నర్ ను విజిట్ కు పంపారని అన్నారు.


గవర్నర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజిట్ చేసి ప్రభుత్వం ధాన్యం సేకరణ బాగా జరుగుతుందని మెచ్చుకున్నారనే విషయం మర్చిపోవద్దన్నారు. గత ఏడాది కంటే 11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వం చేపట్టింది.ఈ రోజు వరకు 5,447 కోట్ల రూపాయలు రైతులకు నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ నిత్యం అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. వచ్చే యాసంగిలో వరి వేయకుండా చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.వరి వేస్తే ఒప్పుకునే ప్రభుత్వానికి మేంమద్దతు ఇస్తాం. అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం LIC సంస్థను ప్రైవేటీకరణ చేసే కుట్రను మేం వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-12-13T21:46:56+05:30 IST