Advertisement
Advertisement
Abn logo
Advertisement
Feb 2 2020 @ 17:41PM

ఇలా జరగాలంటే మరో వెయ్యేళ్లు ఆగాల్సిందే..

ఇంటర్నెట్ డెస్క్: :

అంకెల అద్భుతాలు ఒక్కో సందర్భంలో సరదాగా ఉంటాయి. ఒక్కోసారి మనం ఎంత దూరం వచ్చామో చెప్తే.. మరోసారి మళ్లీ చూడలేని రోజులను గుర్తుచేసి మనలోని వైరాగ్య భావాలను నిద్రలేపుతాయి. ఈరోజు అంటే ఫిబ్రవరి 2, 2020 కూడా అలాంటిదే. ఎందుకంటే ఈ తేదీ ఓ ఎనిమిదంకెల పాలిండ్రోమ్ సంఖ్య. అంటే ముందు నుంచి చదివినా, వెనక నుంచి చదివినా ఒకేలా ఉండే సంఖ్య అన్నమాట. ఈరోజు తేదీ.. 02-02-2020ను ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటుంది.

 

అంతేకాదండోయ్ ఈ తేదీ క్రాస్ కల్చరల్ కూడా. అంటే పాశ్చాత్యులు, ఇతరులు తేదీ రాసేటప్పుడు వేరే వేరు విధానాలను పాటిస్తారు. అంటే తేదీలను రోజు, నెల, ఏడాది వచ్చేలా ఓ వర్గం రాస్తే.. నెల, రోజు, ఏడాది వచ్చేలా మరో వర్గం రాస్తుంది. ఈరోజు తేదీని ఎలా రాసినా అదే సంఖ్య వస్తుంది. ఇలాంటి వింత 909ఏళ్ల క్రితం ఓసారి జరిగింది. అప్పుడు 11-11-1111న ఇలాంటి పాలిండ్రోమ్ సంఖ్య తేదీగా వచ్చింది. మళ్లీ ఇలాంటి వింతను మన జీవితాల్లో చూడలేం. ఎందుకంటే మరోసారి ఇలాంటి పాలిండ్రోమ్ తేదీ రావాలంటే దాదాపు 1000ఏళ్లు వేచిచూడాలి మరి. 

TAGS:
Advertisement
Advertisement