Abn logo
Mar 6 2020 @ 15:13PM

‘ప‌లాస 1978’ మూవీ రివ్యూ

విడుద‌ల‌:  మీడియా 9, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌

బ్యాన‌ర్‌:  సుధాస్ మీడియా

స‌మ‌ర్ప‌ణ‌:  త‌మ్మారెడ్డి భ‌రద్వాజ‌

న‌టీన‌టులు:  ర‌క్షిత్‌, న‌క్ష‌త్ర‌, తిరువీర్‌, ర‌ఘుకుంచె, జ‌నార్ధ‌న్‌, శ్రుతి, ల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రులు

సంగీతం:  ర‌ఘుకుంచె

కెమెరా: అరుల్ విన్సెంట్‌

నిర్మాత‌:  ధ్యాన్ అట్లూరి వ‌ర‌ప్ర‌సాద్‌

ద‌ర్శ‌క‌త్వం:  క‌రుణ కుమార్‌


ఈ మ‌ధ్య టాలీవుడ్‌లో పీరియాడిక‌ల్ సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ముఖ్యంగా కొన్ని నిజ ఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని వాటికి ఫిక్ష‌న్ అంశాల‌ను జోడించి ఓ ప్ర‌త్యేక‌మైన ప్రాంతం, యాస‌, కాలంలో సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. రా కంటెంట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలు మంచి ఆద‌ర‌ణ‌ను కూడా పొందుతున్నాయి. ఆ కోవ‌లో మ‌న ముందుకు వ‌చ్చిన చిత్రం ‘ప‌లాస 1978’. కుల వివక్ష ఆధారంగా తెలుగులో చాలా సినిమాలు వ‌చ్చాయి. మ‌రి అలాంటి నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ  ‘ప‌లాస 1978’ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...క‌థ‌:

1978 ప్రాంతంలో శ్రీకాకుళంలో జిల్లాలోని ప‌లాస‌లో జ‌రిగిన కొన్ని నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. అప్పటి రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను ఉన్న‌త కులాలు, త‌క్కువ కులాలు అని వేరు చేస్తుంటారు. ప‌లాస ఊరి షావుకారు(జ‌న్ని) అత‌ని త‌మ్ముడు గురుమూర్తి(ర‌ఘుకుంచె) ఊరికి పెద్ద‌లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అన్న‌ద‌మ్ములైన‌ప్ప‌టికీ వీరిద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డుతుంటారు. వీరి క‌నుస‌న్న‌ల్లోనే ఊరు ఉంటుంది. వీరు అక్క‌డి ప్ర‌జ‌ల మీద త‌మ ఆదిప‌త్యం చూపిస్తుంటారు. చిన్న కులాలంటూ కొంత మందిని త‌క్కువ‌గా చూస్తుంటారు. ఈ నేప‌థ్యంలో దేవుడు ముందు గ‌జ్జ‌క‌ట్టి ఆడే కులానికి చెందిన యువ‌కుడు మోహ‌న్‌రావు(ర‌క్షిత్‌) త‌న వాడ‌కు చెందిన అమ్మాయి(న‌క్ష‌త్ర‌)ను ప్రేమిస్తాడు. మోహ‌న్‌రావు అన్న‌య్య రంగారావు(తిరువీర్‌) ఊరి పెద్ద‌లు చేసే అన్యాయానికి ఎదురు తిరుగుతారు. అన్న‌య్య పెద్ద షావుకారుని ఎదురించిన అన్న‌ద‌మ్ముల‌ను చిన్న షావుకారు గురుమూర్తి చేర‌దీస్తాడు. క్ర‌మంగా రంగారావు, మోహ‌న్‌రావు మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌స్తాయి. దాంతో రంగారావు మ‌ళ్లీ పెద్ద షావుకారు ద‌గ్గ‌రుకు వెళ్లిపోతాడు. వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు ఎలాంటి మ‌లుపులు తిరుగుతాయి. అన్న‌ద‌మ్ముల‌ను ఎవ‌రు చంపాల‌నుకుంటారు? అన్న‌ద‌మ్ములు ఒక్క‌ట‌య్యారా?  త‌మ పోరాటంలో విజ‌యం సాధించారా?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

విశ్లేష‌ణ‌:

దాదాపు కొత్త న‌టీన‌టులతో చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాల‌కు నేప‌థ్యం, నెరేష‌న్ కీల‌కంగా ఉంటాయి. ఈ సినిమా విష‌యానికి వస్తే ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్ సినిమా కోసం ఎంచుకున్న నేప‌థ్యం దాన్ని తెర‌కెక్కించిన తీరు బావుంటుంది. సినిమా చూసే ప్రేక్ష‌కుడిని స‌ద‌రు ప్రాంతానికి తీసుకెళ్లిన‌ట్లుగా సినిమాను మ‌లిచారు. అలాగే స‌న్నివేశాల‌ను బ‌లాన్ని చేకూర్చేలా మంచి డైలాగ్స్ కూడా రాసుకున్నారు. షార్ట్ ఫిలింస్‌లో జాతీయ అవార్డుల‌ను గెలుచుకున్న ద‌ర్శ‌కుడు క‌రుణ తొలి సినిమాగా ఇలాంటి కాన్సెప్ట్‌ను ఎంచుకోవ‌డం సాహ‌స‌మ‌నే చెప్పాలి.


న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే ర‌క్షిత్ నాలుగు గెట‌ప్స్‌లో క‌న‌ప‌డ‌తారు. నాలుగు వేరియేష‌న్స్‌లో త‌ను చేసిన న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. క‌థానుగుణంగా బ‌రువు త‌గ్గుతూ, పెరుగుతూ హీరో ర‌క్షిత్ చ‌క్క‌గా న‌టించాడు. త‌ను పాత్ర‌లో ఒదిగిపోవ‌డానికి పెట్టిన ఎఫ‌ర్ట్ స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతుంది. ప్రారంభంలోనే ఇలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌డం త‌న‌కు ఎంతో ప్ల‌స్ అని చెప్పాలి. ఇక హీరోయిన్ ర‌క్షిత కూడా గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌తోనూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. హీరో అన్న‌య్య పాత్ర‌లో న‌టించిన తిరువీర్ చ‌క్క‌గా న‌టించారు. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ఘుకుంచె మూడు ర‌కాల పాత్ర‌ల్లో క‌నిపించాడు. త‌ను పాత్ర‌ను క్యారీ చేసిన తీరు చాలా బావుంది. నటీన‌టుల మ‌ధ్య ఎమోష‌న్స్‌, వాటి సంఘ‌ర్ష‌ణ‌ల‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. అవి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి. క‌థ‌లో చాలా చోట్ల లాజిక‌ల్‌గా క‌న్విన్స్ చేయ‌లేద‌నిపించింది. ఉదాహ‌ర‌ణ‌కు హీరో కొంత మందిని చంపుతాడు. అందుకు గ‌ల కార‌ణాలు బ‌ల‌మైన ఎమోష‌న్స్‌తో చూపించ‌లేద‌నిపించింది. అలాగే అస‌లు హీరో ఉన్నాడా, చ‌నిపోయాడా? అనే క్లారిటీ ఆడియెన్స్‌కు ఇచ్చేసి అత‌ను బ్ర‌తికాడా? చ‌నిపోయాడా? అనే డౌట్‌ను వ్య‌క్తం చేయ‌డ‌మేంటో అర్థం కాదు. ఇక సినిమాలో విఘ్నేశ్వ‌రుడి త‌ల‌కు, ఏక‌ల‌వ్యుడు వేలికి..దేవుళ్ల‌కు ముడి పెట్టే డైలాగ్ చెప్పించారు. విఘ్నేశ్వరుడు అంటే దేవుడు పురాణ పురుషుడు.. ఏక‌ల‌వ్యుడు అంటే చారిత్రాక పురుషుడు. వీటికి లింకేంటో అర్థం కాదు. ర‌ఘుకుంచె సంగీతం గొప్ప‌గా ఏం లేదు.  సెకండాఫ్ బోరింగ్‌గా అనిపిస్తుంది. కెమెరా ప‌నిత‌నం బావుంది.


చివర‌గా.. ‘ప‌లాస 1978’...ఓకే అనిపించే యాక్షన్ డ్రామా

రేటింగ్: 2.5/5

Advertisement
Advertisement
Advertisement