స్థానికులనే ఉద్యోగాల్లో నియమించుకోండి: పళనిస్వామి

ABN , First Publish Date - 2020-06-07T02:38:35+05:30 IST

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు పెద్ద ఎత్తున సొంత రాష్ట్రాలకు తరలిపోయారు. ఈ నేపథ్యంలో స్థానిక

స్థానికులనే ఉద్యోగాల్లో నియమించుకోండి: పళనిస్వామి

చెన్నై: కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు పెద్ద ఎత్తున సొంత రాష్ట్రాలకు తరలిపోయారు. ఈ నేపథ్యంలో స్థానిక కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పారిశ్రామికవేత్తలను కోరారు. లాక్‌డౌన్ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇస్తుందన్నారు.


చెన్నైలోని కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన వర్చువల్ మీట్ ‘లుమినస్ తమిళనాడు’ ప్రారంభంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వలస కార్మికులు అందుబాటులో లేకపోవడంతో వారి స్థానంలో స్థానిక కార్మికులను నియమించుకోవడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు.


స్థానిక కార్మికులకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడంలో తమిళనాడు నైపుణ్య అభివృద్ధి సంస్థ.. సీఐఐతో చేతులు కలపడానికి ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, లాక్‌డౌన్ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి మరిన్ని సడలింపులు ఇస్తామని పళనిస్వామి తెలిపారు.

Updated Date - 2020-06-07T02:38:35+05:30 IST