ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా, అభివృద్ధి పథకాలు ఆగబోవు : పళని స్వామి

ABN , First Publish Date - 2020-05-24T00:29:34+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి అష్ట దిగ్బంధనం వల్ల తమిళనాడు రాష్ట్రం దాదాపు

ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా, అభివృద్ధి పథకాలు ఆగబోవు : పళని స్వామి

చన్నై : కోవిడ్-19 మహమ్మారి అష్ట దిగ్బంధనం వల్ల తమిళనాడు రాష్ట్రం దాదాపు రూ.35 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి చెప్పారు. అయితే ఈ ప్రభావం అభివృద్ధి పథకాలపై పడబోదని భరోసా ఇచ్చారు. 


పళని స్వామి సేలంలో విలేకర్లతో మాట్లాడుతూ, మార్చి చివరి వారం నుంచి మే వరకు అష్ట దిగ్బంధనం వల్ల జీఎస్‌టీ ఆదాయం దాదాపు రూ.35,000 కోట్లు ప్రభుత్వానికి రాలేదని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పొదుపు చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే అభివృద్ధి పథకాలపై ఈ ప్రభావం పడదని, అభివృద్ధి పథకాల వల్ల ఉపాధి సృష్టి జరుగుతుందని చెప్పారు. 


వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఇప్పటికే కొన్ని సడలింపులు ఇచ్చామని, వైద్య నిపుణుల కమిటీని సంప్రదించి, మరిన్ని సడలింపులు ఇవ్వడంపై ప్రకటన చేస్తామని తెలిపారు. 


కరోనా వైరస్ మహమ్మారి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగడం లేదని, ఈ మహమ్మారిని నిరోధించేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.


Updated Date - 2020-05-24T00:29:34+05:30 IST