పళనిలో Electrical వించ్‌ ట్రయల్‌ రన్‌

ABN , First Publish Date - 2022-05-14T15:51:13+05:30 IST

సుప్రసిద్ధ శైవక్షేత్రం పళని పర్వతాలయానికి భక్తులను తీసుకెళ్లే మూడో ఎలక్ట్రికల్ వించ్‌ మరమ్మతులు శుక్రవారం తో ముగిశాయి. ఆ వించ్‌ పనితీరును భద్రతాధికారులు పరిశీలించి

పళనిలో Electrical వించ్‌ ట్రయల్‌ రన్‌

చెన్నై: సుప్రసిద్ధ శైవక్షేత్రం పళని పర్వతాలయానికి భక్తులను తీసుకెళ్లే మూడో ఎలక్ట్రికల్ వించ్‌ మరమ్మతులు శుక్రవారం తో ముగిశాయి. ఆ వించ్‌ పనితీరును భద్రతాధికారులు పరిశీలించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. పళని ఆలయానికి కొండదిగువ నుంచి భక్తులను తరలించేందుకు రోప్‌కారు, మూడు ఎలక్ట్రికల్ వించ్‌లను ఉపయోగిస్తున్నారు. భద్రతావిభాగం అధికారులు నెలకొకసారి రోప్‌కారును, వించ్‌లను పరిశీలించడం ఆనవాయితీ. ఇటీవల వీటిని పరిశీలించినప్పుడు మూడో ఎలక్ట్రికల్ వించ్‌ ఇనుప దారం బాగా దెబ్బతినడం గమనించారు. దీంతో ఆ మూడో వించ్‌కు మరమ్మతులు చేపట్టారు. ఆ వించ్‌కు కొత్తగా ఇనుప తాడు బిగించి మరమ్మతులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఈ వించ్‌లో పంచామృతం డబ్బాలు ఎక్కించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. కొండదిగువ నుంచి పర్వతాలయం వరకూ ఈ వించ్‌ సక్రమంగా నడవటంతో భద్రతా విభాగం అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మూడో ఎలక్ట్రికల్ వించ్‌ను ఒక రెండు రోజుల్లోగా ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

Read more