Advertisement
Advertisement
Abn logo
Advertisement

పక్ష బ్రాండ్ అంబాసిడర్‌గా శృతిహాసన్

ముంబై: తరినిక జువెల్స్‌కు చెందిన పక్ష బ్రాండ్‌కు ప్రముఖ సినీ నటి శృతిహాసన్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయంగా బ్రాండ్‌ యొక్క ఆకర్షణను మరింత బలోపేతం చేయడంలో శృతి కీలక పాత్ర పోషించనున్నారు. తరినిక బ్రాండ్‌ పక్ష, అంతర్జాతీయంగా అత్యున్నత నాణ్యత కలిగిన 925 వెండి ఆభరణాలకు సుప్రసిద్ధం. ఈ బ్రాండ్‌ ఇప్పుడు శృతి హాసన్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించినట్లు ప్రకటించింది. ఈ బ్రాండ్‌ తమ ‘మ్యూజ్‌’ కలెక్షన్‌తో శృతిహాసన్‌తో ప్రత్యేకంగా ప్రచారమూ చేయనుంది. ఈ సందర్భంగా శృతిహాసన్‌ మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన పక్ష బై తరినిక బ్రాండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఆభరణాల పరిశ్రమలో అగ్రగామి బ్రాండ్‌ ఇది.’’ అని అన్నారు. సంస్థ ప్రతినిధి సునైనా రామిశెట్టి మాట్లాడుతూ ‘‘అపార ప్రతిభావంతురాలు శృతి. దీంతో పక్షకు సహజసిద్ధంగానే ఆమె ప్రచారకర్తగా నిలువగలరు. బహుముఖ ప్రతిభాశాలి కావడంతో పాటుగా బలమైన వ్యక్తిత్వం కలిగిన ఆమె బ్రాండ్‌కు సరైన గుర్తింపును తీసుకురాగలరు. అత్యంత ఆకర్షణీయంగా బ్రాండ్‌ సిద్ధాంతాన్ని తనదైన మార్గంలో ప్రదర్శించగలరు’’ అని అన్నారు.

Advertisement
Advertisement