'పక్కా కమర్షియల్': ఏంజిల్ రాశీఖన్నా వీడియో రిలీజ్..

మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'పక్కా కమర్షియల్'. బబ్లీ బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్‌నర్‌పై మంచి అంచనాలున్నాయి. కాగా, నేడు (నవంబర్ 30) రాశీఖన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ బ్యూటిఫుల్ వీడియోను వదిలారు. ఈ వీడియోలో అచ్చం ఏంజిల్‌లా కనిపిస్తోంది. ఇంతకముందు వచ్చిన 'ప్రతి రోజూ పండగే' మూవీలో ఏంజెల్ ఆర్ణా అనే పాత్రలో రాశీని ఎంత అందంగా చూపించాడో అంతకంటే అందంగా 'పక్కా కమర్షియల్' మూవీలో దర్శకుడు మారుతీ చూపించబోతున్నాడని తాజాగా వదిలిన వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ఆమె లాయర్ పాత్రలో సందడి చేయబోతోంది. ఇక రాశీఖన్నా తమిళంతో కలుపుకొని అరడజనుకు చిత్రాలకు పైగానే నటిస్తోంది. 


Advertisement