మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ బంద్... పాకిస్తాన్ టెలికాం ఆపరేటర్ల హెచ్చరిక

ABN , First Publish Date - 2022-07-01T22:22:18+05:30 IST

దేశవ్యాప్తంగా విద్యుత్తు అంతరాయం కారణంగా మొబైల్/ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే పరిస్థితి ఉందంటూ పాకిస్థాన్‌ టెలికాం ఆపరేటర్లు హెచ్చరించారు.

మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ బంద్...  పాకిస్తాన్ టెలికాం ఆపరేటర్ల హెచ్చరిక

ఇస్లామాబాద్ : దేశవ్యాప్తంగా విద్యుత్తు అంతరాయం కారణంగా మొబైల్/ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే పరిస్థితి ఉందంటూ పాకిస్థాన్‌ టెలికాం ఆపరేటర్లు హెచ్చరించారు. విద్యుత్తు అంతరాయం తరచుగా 12-14 గంటల కంటే ఎక్కువ ఉంటుండడమే కాకుండా, వేడి గాల్పుల నేపథ్యంలో జనజీవనం అతలాకుతలమవుతోంది. దేశవ్యాప్తంగా ఎక్కువ గంటలు విద్యుత్తు అంతరాయం కారణంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని పాక్‌లోని టెలికాం ఆపరేటర్లు భావిస్తున్నారు.


అంతరాయం కారణంగా వారి కార్యకలాపాలకు సమస్యలు, ఆటంకాలు ఏర్పడుతున్నాయంటూ పాకిస్తాన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్(NIBT) ట్వీట్ రచేసింది. అయితే ఆ ట్వీట్‌ను తర్వాత తొలగించారు. NITBని గూగ్లింగ్ చేసిన తర్వాత... ఆ ట్విట్ మళ్ళీ దర్శనమిచ్చింది. కాగా... జులైలో తరచూ విద్యుత్తు అంతరాయాలు పెరుగుతాయని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. పాకిస్తాన్ తన శక్తి అవసరాలను తీర్చడానికి అవసరమైన ద్రవీకృత సహజవాయువు(LNG) సరఫరాను పొందలేకపోయింది. 


ఇదిలా ఉంటే... పాకిస్తాన్ నెలవారీ ఇంధనం దిగుమతులు జూన్‌లో నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకునే పరిస్థితి నెలకొన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.. మరోవైపు... ఫారెక్స్ సంక్షోభం మధ్య ప్రపంచాన్ని కుంగదీస్తున్న ఇంధన సంక్షోభం కారణంగా ఆర్థిక స్థితిని దెబ్బతీసే స్పాట్ మార్కెట్ నుండి దేశం LNG కొనుగోలు చేయాల్సి వస్తోంది. 

పాకిస్తాన్‌కు LNGని అందించాల్సిన యూరోపియన్ కంపెనీలు ఆంక్షలను డిఫాల్ట్ చేశాయి, స్పాట్ మార్కెట్ నుండి ఒక్క LNG షిప్‌మెంట్‌ను కొనుగోలు చేయడానికి కూడా పాకిస్తాన్ దాదాపు $100 మిలియన్ చెల్లించాల్సి వస్తోంది. విద్యుత్తు  వినియోగాన్ని తగ్గించేందుకు పలు నగరాల్లోని  షాపింగ్ మాల్స్, పరిశ్రమలను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక... విద్యుత్తు సంక్షోభం నేపథ్యంలో ఇస్లామాబాద్... ఖతార్ వైపు చూస్తోంది. 

Updated Date - 2022-07-01T22:22:18+05:30 IST