పిరికిపంద పాక్ త్వరలోనే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది : రవీందర్ రైనా

ABN , First Publish Date - 2020-10-30T17:35:50+05:30 IST

దాయాది పాకిస్తాన్ కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మండిపడ్డారు.

పిరికిపంద పాక్ త్వరలోనే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది : రవీందర్ రైనా

శ్రీనగర్ : దాయాది పాకిస్తాన్ కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మండిపడ్డారు. కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలోనే రవీందర్ రైనా పై విధంగా స్పందించారు. ‘‘వారు చాలా ధైర్యం గల కార్యకర్తలు. వారు భారత మాత కోసం బలిదానమయ్యారు. వారి త్యాగాలు ఊరికే పోవు. ఈ పాపానికి పిరికి పందైన పాకిస్తాన్ త్వరలోనే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.’’ అని రవీందర్ రైనా మండిపడ్డారు. 


జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ  ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు. మృతులను ఫిదా హుసేన్‌, ఉమర్‌ రషీద్‌, ఉమర్‌ రంజాన్‌ హాజంగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2020-10-30T17:35:50+05:30 IST