Delhi: Pakistani ఉగ్రవాది అరెస్ట్...terror planను భగ్నం చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2021-10-12T18:20:49+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో దసరా పండుగ సందర్భంగా ఉగ్ర దాడికి పాక్ ఉగ్రవాదులు పన్నిన ప్లాన్ ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు...

Delhi: Pakistani ఉగ్రవాది అరెస్ట్...terror planను భగ్నం చేసిన పోలీసులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో దసరా పండుగ సందర్భంగా ఉగ్ర దాడికి పాక్ ఉగ్రవాదులు పన్నిన ప్లాన్ ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో పాకిస్థాన్ జాతీయుడిని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులోని నరోవాల్ నివాసి అయిన మహ్మద్ అష్రఫ్ ను ఢిల్లీలోని లక్ష్మీనగర్ రమేష్ పార్కు ప్రాంతంలో అరెస్ట్ చేశారు.అష్రఫ్ నుంచి ఏకే -47 రైఫిల్, 60 రౌండ్ల తూటాలు, ఒక హ్యాండ్ గ్రెనెడ్ , రెండు అధునాతీన పిస్టళ్లను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 



పాక్ ఉగ్రవాది అయిన అష్రఫ్ భారతీయ నకిలీ గుర్తింపు కార్డుతో ఢిల్లీలో నివశిస్తున్నాడని పోలీసులు చెప్పారు. పాక్ ఉగ్రవాది అరెస్టుతో ఢిల్లీ పెద్ద ఉగ్రదాడి ప్లాన్ ను విఫలం చేశామని ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ అస్థానా చెప్పారు. అష్రఫ్ స్లీపర్ సెల్ సభ్యుడని, అతనిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, పేలుడు, ఆయుధాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-10-12T18:20:49+05:30 IST