Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 23 May 2022 16:52:34 IST

Karan Johar పై లీగల్ యాక్షన్ తీసుకుంటానంటున్న పాకిస్థానీ సింగర్

twitter-iconwatsapp-iconfb-icon
Karan Johar పై లీగల్ యాక్షన్ తీసుకుంటానంటున్న పాకిస్థానీ సింగర్

బాలీవుడ్ స్టార్ కిడ్స్‌ను బీ టౌన్‌లో లాంచ్ చేసే దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar). ఆయన తాజాగా నిర్మించిన సినిమా ‘జుగ్ జుగ్ జియో’ (Jugjugg Jeeyo). ఈ చిత్రంలో వరుణ్ ధావన్, కియారా అడ్వాణీ, నీతూ కపూర్, అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూవీ ట్రైలర్‌ను మే 22న విడుదల చేశారు. ట్రైలర్‌లో ‘నాచ్ పంజాబ్’ (Nach Punjaban) అనే పాటను వాడారు. ఈ పాట తనదేనంటూ పాకిస్థానీ సింగర్ అబ్రార్ ఉల్ హక్ (Abrar Ul Haq) ఆరోపించారు. ఎవరికి లైసెన్స్ ఇవ్వలేదని చెప్పారు. ‘జుగ్ జుగ్ జియో’ నిర్మాత కరణ్ జోహార్‌కు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. 


పాకిస్థానీ సింగర్ అబ్రార్ ఉల్ హక్ సోషల్ మీడియా వేదికగా మే 23న వరుసగా పోస్ట్‌లు పెట్టారు. ‘‘నా పాట ‘నాచ్ పంజాబ్’ హక్కులను ఏ ఇండియన్ మూవీకీ అమ్మలేదు. హక్కులు నా దగ్గరే ఉన్నాయి. నాకు జరిగిన నష్టాన్ని క్లెయిం చేసుకోవడానికీ కోర్లు మెట్లె‌క్కబోతున్నాను. కరణ్ జోహార్ లాంటి నిర్మాతలు సాంగ్స్‌ను కాపీ చేయకూడదు. నా పాటను ఇలా కాపీయింగ్ చేయడం 6వసారి. దీనికి ఎంత మాత్రం నేను అంగీకరించను. ‘నాచ్ పంజాబ్’ హక్కులను ఎవరికీ ఇవ్వలేదు. ఎవరి దగ్గరైనా హక్కులు ఉన్నట్లయితే అగ్రిమెంట్‌ను చూపించాలి. నేను లీగల్ యాక్షన్ తీసుకోవడానికీ సిద్దంగా ఉన్నాను’’ అని అబ్రార్ ఉల్ హక్ ట్వీట్ చేశాడు. ‘జుగ్‌జుగ్ జియో’ పాటల హక్కులు టి-సిరీస్ వద్ద ఉన్నాయి. పాకిస్థానీ సింగర్ ఆరోపణలన్నింటికీ ఆ మ్యూజిక్ లేబుల్ రిప్లై ఇచ్చింది.


‘నాచ్ పంజాబ్’ హక్కులను 2002లోనే సొంతం చేసుకున్నామని టి-సిరీస్ తెలిపింది. ‘‘మేం న్యాయబద్దంగా ‘నాచ్ పంజాబ్’ హక్కులను దక్కించుకున్నాం. ఆ పాట అడాప్ట్‌టేషన్‌ను 2002, జనవరి 1నుంచి  ఐ టూన్స్‌లో ఉంచాం. మూవీ‌బాక్స్ రికార్డ్స్ లేబుల్ ఆపరేట్ చేసే ‘లాలీవుడ్ క్లాసిక్స్’ యూట్యూబ్ ఛానల్‌లో ఈ పాట అందరికీ అందుబాటులో ఉంది. మూవీ బాక్స్ రికార్డ్స్ లేబుల్ వద్దే ‘నాచ్ పంజాబ్’ పాట హక్కులు ఉన్నాయి’’ అని టి-సిరీస్ సంస్థ పేర్కొంది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement