భారత ప్రధానమంత్రి మోదీకి పాక్ యువతి కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2022-03-09T15:57:04+05:30 IST

ఓ పాకిస్థానీ యువతి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఘటన తాజాగా వెలుగుచూసింది....

భారత ప్రధానమంత్రి మోదీకి పాక్ యువతి కృతజ్ఞతలు

కైవ్(ఉక్రెయిన్): ఓ పాకిస్థానీ యువతి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రాంతం నుంచి తనను సురక్షితంగా తరలించినందుకు భారత ప్రధాని మోదీకి, ఉక్రెయిన్ దేశంలోని భారత రాయబార కార్యాలయానికి పాకిస్థానీ యువతి కృతజ్ఞతలు తెలిపింది. ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రాంతం నుంచి పాక్ యువతి అస్మా షఫీక్ ను కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఉద్యోగులు సురక్షితంగా తరలించారు.చాలా క్లిష్టపరిస్థితుల నుంచి తనకు సహాయం చేసిన భారత రాయబార కార్యాలయానికి, భారత ప్రధాని నరేంద్రమోదీకి పాక్ యువతి అస్మా ధన్యవాదాలు తెలిపింది.




‘‘నేను భారత ప్రధాని మోదీకి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను సురక్షితంగా ఇంటికి చేరుకుంటానని ఆశిస్తున్నాను, భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు’’ అని పాక్ యువతి అస్మా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలో పేర్కొంది.ఫిబ్రవరి 24 న రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి భారత ప్రభుత్వం ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాల ద్వారా ఆపరేషన్ గంగా కింద భారతీయ పౌరులను తరలిస్తోంది.రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 16వేల మందికి పైగా పౌరులు భారతదేశానికి తిరిగి వచ్చారు.


Updated Date - 2022-03-09T15:57:04+05:30 IST