Jammu and Kashmir: కశ్మీరులో పాకిస్థానీ జెండాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-14T21:34:06+05:30 IST

జమ్మూ-కశ్మీరులో భారత దేశ జాతీయ జెండాలే ఎగురుతాయని, ఇక్కడ పాకిస్థానీ

Jammu and Kashmir: కశ్మీరులో పాకిస్థానీ జెండాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలు

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులో భారత దేశ జాతీయ జెండాలే ఎగురుతాయని, ఇక్కడ పాకిస్థానీ జెండాలు ఎగరడం గత చరిత్ర అని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Lieutenant Governor Manoj Sinha) అన్నారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు (Dal Lake) వద్ద తిరంగా యాత్ర (Tiranga Yatra) సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 


పాకిస్థానీ జెండాల (Pakistani Flags)ను ఎగురవేయడమనేది గత చరిత్ర అని, ఇప్పుడు కేవలం భారత దేశ జాతీయ పతాకాలు మాత్రమే ఎగురుతాయని చెప్పారు. గతంలో ప్రజలు  త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసేలా ప్రోత్సహించడానికి తక్కువ ప్రయత్నాలు జరిగాయని, ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజలు కూడా జాతీయ జెండాను ఎగురవేయాలని కోరుకుంటున్నారని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, అందరూ తిరంగా యాత్రలో పాల్గొంటున్నారని చెప్పారు. 


కశ్మీరు లోయలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు జరుగుతున్న తొలి కార్యక్రమం ఇదే. అది కూడా పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగే ఆగస్టు 14న ఈ కార్యక్రమం జరుగుతోంది. గతంలో ఈ రోజున భద్రతాపరమైన సవాళ్ళు ఎదురవుతూ ఉండేవి. పాకిస్థానీ జెండాలను ఎగురవేయడానికి వేర్పాటువాదులు ప్రయత్నించేవారు. 


Updated Date - 2022-08-14T21:34:06+05:30 IST