Pakistani: వధూవరులు ఎక్స్‌కవేటర్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు...దీనిపై వధువు ఏం చెప్పిందంటే...

ABN , First Publish Date - 2021-10-05T18:16:14+05:30 IST

జీవితంలో వివాహ వేడుక చిరస్మరణీయ సంఘటనగా ఉండాలని దంపతులు కోరుకుంటారు...కొందరు వివాహ వేడుకల కోసం లగ్జరీ హెలికాప్టర్లు ఎంచుకుంటారు...

Pakistani: వధూవరులు ఎక్స్‌కవేటర్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు...దీనిపై వధువు ఏం చెప్పిందంటే...

ఇస్లామాబాద్ : జీవితంలో వివాహ వేడుక చిరస్మరణీయ సంఘటనగా ఉండాలని దంపతులు కోరుకుంటారు. కొందరు వివాహ వేడుకల కోసం లగ్జరీ హెలికాప్టర్లు ఎంచుకుంటారు...మరికొందరు షిప్పుల్లోనూ వివాహాలు చేసుకుంటుంటారు...కాని పాకిస్థాన్ దేశంలో ఓ కొత్త జంట ఎక్స్‌కవేటరుపై పెళ్లి వేదిక వద్దకు వచ్చి కొత్త ట్రెండ్ సృష్టించింది. పాకిస్థాన్ దేశంలోని హుంజా లోయకు చెందిన ఓ వరుడు ఎక్స్‌కవేటరు నడిపిస్తుంటారు. తనకు కాబోయే భర్త వృత్తిని గౌరవిస్తూ అతని ఎక్స్‌కవేటరులోనే తామిద్దరం వివాహ వేదిక వద్దకు రావాలని నిర్ణయించుకున్నట్లు వధువు చెప్పింది. 


వధూవరులిద్దరూ పెళ్లి దుస్తులు ధరించి ముస్తాబై వరుడి సొంత ఎక్స్‌కవేటరులోనే నిలబడి వివాహ వేదిక వద్ద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి అనంతరం కూడా కొత్త దంపతులు ఎక్స్‌కవేటరుపైనే వివాహ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. వధూవరులు ఎక్స్‌కవేటరులో రావడం చూసిన అతిథులు కొందరు అభినందనల వర్షం కురిపించగా, మరికొందరు ఇలా ఎక్స్‌కవేటరులో రావడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.


Updated Date - 2021-10-05T18:16:14+05:30 IST