Abn logo
Jun 21 2021 @ 10:28AM

అమ్మాయిపై పాక్ మతాధికారి లైంగిక వేధింపులు..అరెస్ట్

ఇస్లామాబాద్ (పాకిస్థాన్): ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ముఫ్తీ అజీజుర్ రెహ్మాన్‌ను పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ముఫ్తీ అజీజుర్ రెహ్మాన్ ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమ్మాయి ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేశారు. తన తండ్రిపై అమ్మాయి కేసు పెట్టిందని అతని ముగ్గురు కుమారులు దాడి చేశారు. దీంతో పోలీసులు అజీజుర్ రెహ్మాన్ తోపాటు అతని ముగ్గురు కుమారులను అరెస్టు చేశారు. అమ్మాయిలపై లైంగిక వేధింపులు సాగకుండా నిరోధించి వారి భవిష్యత్ కోసం తాము రెహ్మాన్ పై కఠిన చర్యలు తీసుకుంటామని  పాక్ ఐజీపీ ఇనామ్ ఘనీ చెప్పారు. రెహ్మాన్ ను లాహోర్ కు తరలించి రెండు రోజుల్లో కోర్టులో హాజరు పరుస్తామని ఐజీ చెప్పారు. 

క్రైమ్ మరిన్ని...