జేసీబీని అందంగా అలంకరించారు... శిధిలాలను ఎత్తడానికి ఇంత అవసరమా?... అనుకున్న జనానికి దిమ్మతిరిగే షాకిచ్చారు!

ABN , First Publish Date - 2021-10-02T14:24:37+05:30 IST

ఇటీవలి కాలంలో పెళ్లివేడుకలు విచిత్రరీతిలో...

జేసీబీని అందంగా అలంకరించారు... శిధిలాలను ఎత్తడానికి ఇంత అవసరమా?... అనుకున్న జనానికి దిమ్మతిరిగే షాకిచ్చారు!

ఇటీవలి కాలంలో పెళ్లివేడుకలు విచిత్రరీతిలో నిర్వహించడం సరికొత్త ట్రెండ్‌గా మారింది. పాకిస్తాన్‌లో ఈ విధంగా జరిగిన ఒక వివాహం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో... అత్యంత విచిత్రరీతిలో కొత్తజీవితంలోకి అడుగుపెట్టిన జంటను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 


పాకిస్తాన్‌లోని హుంజా ఘాటీ ప్రాంతానికి చెందిన ఈ వీడియోను గులాం అబ్బాస్ షా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఒక నూతన పెళ్లి జంట తమ వివాహ తంతు కోసం అత్యంత సుందరంగా ముస్తాబయ్యింది. ఈ సందర్భంగా వారి వివాహ ఊరేగింపు ఎవరూ ఊహించని విధంగా సాగింది. ఆ నూతన వధూవరులు జేసీబీలో కూర్చుని, వివాహ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై వెళుతున్నవారంతా ఈ నూతన వధూవరులను నోరెళ్లబెట్టి చూశారు. ఈ ఊరేగింపునకు వినియోగించిన జేసీబీని అందంగా అలంకరించారు. విద్యుత్ దీపాలను కూడా అమర్చారు. జేసీబీ ముందు బంధువులు ఆనందంగా నృత్యం చేస్తూ కనిపిస్తున్నారు. కొద్దిదూరం వెళ్లిన తరువాత జేసీబీ ఆగడంతో దానిలో నుంచి వధూవరులు కిందకు దిగారు. కొద్దిరోజుల క్రితం మన దేశంలోని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఒక వివాహంలో కూడా వధూవరుల ఊరేగింపునకు జేసీబీని వినియోగించారు. 

Updated Date - 2021-10-02T14:24:37+05:30 IST