పాకిస్థాన్ మరో కుట్ర.. పీవీసీ పైపుల ద్వారా భారత్‌లోకి డ్రగ్స్ డంపింగ్!

ABN , First Publish Date - 2020-09-21T00:22:21+05:30 IST

పాకిస్థాన్ మరో అరాచకానికి తెరలేపింది. భారత సరిహద్దులో నార్కో టెర్రరిజానికి పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టారులో

పాకిస్థాన్ మరో కుట్ర.. పీవీసీ పైపుల ద్వారా భారత్‌లోకి డ్రగ్స్ డంపింగ్!

జమ్మూకశ్మీర్: పాకిస్థాన్ మరో అరాచకానికి తెరలేపింది. భారత సరిహద్దులో నార్కో టెర్రరిజానికి పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టారులో అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ డంప్ చేసిన 62 కేజీల హెరాయిన్‌ను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఈ నెల 19-20 మధ్య రాత్రి వేళ పాకిస్థాన్ వైపు అంతర్జాతీయ సరిహద్దులో అనుమానాస్పద కదలికలు గుర్తించినట్టు జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎన్ఎస్ జామ్‌వాల్ తెలిపారు.


ఆ వెంటనే కాల్పులు ప్రారంభమయ్యాయని, బీఎస్ఎఫ్ బలగాలు కూడా వెంటనే కాల్పులు ప్రారంభించినట్టు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కాల్పులు వంకతో భారత్‌ భూభాగంలోకి డ్రగ్స్‌ను డంప్ చేసినట్టు పేర్కొన్నారు. కాల్పులు ఆగిన తర్వాత అనుమానాస్పద కదలికలు ఆగినట్టు గుర్తించామన్నారు.


ఈ ఉదయం బుధ్‌వార్ బోర్డర్ అవుట్ పోస్ట్ (బీఓపీ) సమీపంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా 62 ప్యాకెట్ల హెరాయిన్, రెండు చైనీస్ పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లు, 9 ఎంఎం మందుగుండు సామగ్రి పది రౌండ్లు లభ్యమైనట్టు చెప్పారు. భారత భూభాగంలోకి డ్రగ్స్‌ను డంప్ చేసేందుకు పాకిస్థాన్ ఆర్మీ, రేంజర్లు పీవీసీ వాటర్ పైపులు ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు.


బుధవార్ బీఓపీ సమీపంలో ఫెన్సింగ్‌లోకి పైపులు చొప్పించి హెరాయిన్, ఆయుధాలు స్మంగ్లింగ్ చేస్తున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. పైపుల ద్వారా సరిహద్దు దాటకుండానే స్మగ్లింగ్ చేస్తున్నట్టు చెప్పారు.  

Updated Date - 2020-09-21T00:22:21+05:30 IST