రాజకీయ అస్థిరత పరిస్థితులు...
ఇస్లామాబాద్ (పాకిస్థాన్): పొరుగున్న ఉన్ప పాక్ దేశంలో రాజకీయ సుస్థిరత లేదు. దీంతో తరచూ ప్రధానమంత్రులు మారుతుంటారు. పాకిస్థాన్ దేశాన్ని 75ఏళ్లలో 21 మంది ప్రధానమంత్రులు పాలించినా, వారు పదవీకాలాన్ని పూర్తి చేయలేదు.వివిధ కారణాలతో పదవీకాలం ముగియక ముందే మధ్యలోనే వారు పదవీ విచ్యుతులయ్యారు. పాక్ ప్రధాని, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇమ్రాన్ తన మెజారిటీని పాక్ నేషనల్ అసెంబ్లీలో నిరూపించుకోవడంలో విఫలమైతే అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడవుతున్న మొదటి ప్రధాని అవుతారు. పాక్ ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ 2013 నుంచి 2017వరకు కేవలం నాలుగేళ్ల పాటు పనిచేశాడు.
పాక్ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నవాజ్ షరీఫ్ పై అనర్హత వేటు విధించడంతో తన పదవీకాలాన్ని పూర్తి చేయలేక పోయారు.పర్వేజ్ అష్రాఫ్ 2012 నుంచి 2013 వరకు కేవలం 9 నెలల పాటు పాక్ ప్రధానిగా పనిచేశారు. అతనిపై కూడా సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. సయ్యద్ యూసుఫ్ రజా గిలానీ కూడా నాలుగేళ్ల పాటు ప్రధానిగా పనిచేసి సుప్రీంకోర్టుతో పదవీవిచ్యుతుడయ్యాడు.మీర్ జఫరుల్లా ఖాన్ జమాలీ ఏడాది 7 నెలలకే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. చౌదరి షుజాత్ హుసేన్ 2004లో కేవలం రెండు నెలలకే ప్రధాని పదవికి రాజీనామా చేశారు.1997 నుంచి 1999 వరకు నవాజ్ షరీఫ్ రెండున్నరేళ్లకే పదవి నుంచి దిగిపోయారు.
బేనజీర్ భుట్టో 1988 నుంచి 1990 వరకు ప్రధానిగా పనిచేసినా, ఆ తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేశారు.ముహమ్మద్ ఖాన్ జునేజో 1985 నుంచి 1988 వరకు మూడేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. జుల్ఫికర్ అలీ భుట్టో 1973 నుంచి 1977 వరకు నాలుగేళ్ల లోపే ప్రధానిగా దిగిపోయారు.బేనజీర్ భుట్టో 1988 నుంచి 1990 వరకు మూడేళ్లే పాకిస్థాన్ దేశాన్ని పాలించారు.తరచూ ప్రధానమంత్రులు పూర్తికాలం పనిచేయకపోవడంపై పాకిస్థాన్ దేశంలో సుస్థిర పాలన లేదనేది స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి