Pakistan: శ్రీలంక చేతిలో దారుణ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గండి

ABN , First Publish Date - 2022-07-28T22:19:38+05:30 IST

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC)లో ఫైనల్‌కు చేరుకోవాలన్న పాకిస్థాన్ (Pakistan) ఆశలకు గండిపడింది. పాకిస్థాన్‌తో

Pakistan: శ్రీలంక చేతిలో దారుణ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గండి

న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC)లో ఫైనల్‌కు చేరుకోవాలన్న పాకిస్థాన్ (Pakistan) ఆశలకు గండిపడింది. పాకిస్థాన్‌తో గాలెలో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక (sri lanka) 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ పరాజయంతో పాకిస్థాన్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ (team india) కంటే దిగువకు పడిపోయి ఐదో స్థానానికి పరిమితమైంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్.. మూడో స్థానానికి ఎగబాకింది. రెండు టెస్టులో గెలిచి ఉంటే కనుక రెండో స్థానానికి చేరుకుని ఉండేది. అయితే, దిముత్ కరుణరత్నె సారథ్యంలోని శ్రీలంక రెండో టెస్టులో ఆల్‌రౌండ్ షో అదరగొట్టి పాక్‌ను మట్టికరిపించింది.


ఇంగ్లండ్‌ (england)తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో ఓటమి పాలైన భారత్ 52.08 విన్నింగ్ పర్సంటేజ్ (PCT)తో నాలుగో స్థానంలో ఉండగా,  పాకిస్థాన్‌పై విజయం సాధించిన శ్రీలంక 53.33 పీసీటీతో మూడో స్థానానికి ఎగబాకింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా (south africa) 71.43 పీసీటీతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 70 పీసీటీతో ఆస్ట్రేలియా (australia) రెండో స్థానంలో ఉంది. ఇక శ్రీలంక చేతిలో ఓడిన పాకిస్థాన్ 51.85 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆరేడు స్థానాల్లో వెస్టిండీస్(50 పీటీసీ), ఇంగ్లండ్ (33.33 పీటీసీ) ఉన్నాయి. 

Updated Date - 2022-07-28T22:19:38+05:30 IST