ఆరోగ్య కార్యకర్తల రక్షణలో ఉన్న పోలీసు అధికారి హత్య!

ABN , First Publish Date - 2021-08-03T14:44:23+05:30 IST

పాకిస్తాన్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. పోలియో ఆరోగ్య కార్యకర్తల...

ఆరోగ్య కార్యకర్తల రక్షణలో ఉన్న పోలీసు అధికారి హత్య!

పెషావర్: పాకిస్తాన్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. పోలియో ఆరోగ్య కార్యకర్తల బృందానికి రక్షణ బాధ్యత వహిస్తున్న ఒక పోలీసు అధికారిపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. రెండు రోజుల్లో ఇది రెండవ ఘటన. దీనికిముందు పెషావర్ జిల్లాలోని దౌద్జాయ్ ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు పోలీసు కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ వజీరిస్తాన్ పరిధిలోని డెరా ఇస్మయిల్ ఖాన్‌లో పోలియో కార్యకర్తలకు రక్షణ బాధ్యతలు వహిస్తున్న పోలీసు అధికారిపై దుండగులు కాల్పులు జరిపి, బైక్‌పై పారిపోయారు. ఈ ఘటనలో ఆ అధికారి అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2021-08-03T14:44:23+05:30 IST