Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 27 2021 @ 11:25AM

పాక్ ISI కొత్త చీఫ్‌గా నదీమ్ అంజుమ్

ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంతకం

ఇస్లామాబాద్: పాకిస్థాన్ గూఢాచారి సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కొత్త అధిపతి నియామకంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంతకం చేశారని సైన్యం తెలిపింది. కొత్త ఐఎస్ఐ చీఫ్‌గా నదీమ్ అంజుమ్‌ను నియమిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, ఖాన్‌ల మధ్య జరిగిన తుది సంప్రదింపుల తర్వాత లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్‌ను ఐఎస్ఐ అధిపతిగా ఆమోదించారు.ఐఎస్‌ఐ హెడ్‌గా నదీమ్ అంజుమ్ ఆమోదం పొంది నవంబర్ 20న బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆగస్ట్‌లో అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల నియంత్రణలోకి వచ్చిన తర్వాత ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద గ్రూపుల పునరుజ్జీవన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐఎస్ఐ కొత్త చీఫ్ నియామకం జరిగింది.ఐఎస్‌ఐతో సహా పాకిస్థాన్ అధికారులకు సీనియర్ తాలిబన్ సభ్యులతో సంబంధాలు ఉన్నాయని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి.గతంలో అప్పటి ఐఎస్ఐ చీఫ్ తాలిబన్ అధికారులను కలవడానికి కాబూల్‌కు రెండు సార్లు వెళ్లారు.అంజుమ్ నియామకం మిలిటరీతో సంబంధాలు సజావుగా మారడానికి సంకేతాలు ఇస్తోంది.

గత ఐఎస్‌ఐ చీఫ్ ఫైజ్ హమీద్‌ను ఆఫ్ఘన్ సరిహద్దుకు దూరంగా ఉన్న వాయువ్య నగరమైన పెషావర్‌కు కార్ప్స్ కమాండర్‌గా నియమించనున్నట్లు మిలటరీ గతంలో పేర్కొంది.త్రీ-స్టార్ జనరల్ అయిన అంజుమ్ నవంబరు 20వతేదీన కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని పాక్ మిలటరీ తెలిపింది.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement