పాక్ 70ఏళ్ల చరిత్రలో సాధ్యం కానిది.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చేసి చూపించి, రికార్డు సృష్టించిదట!

ABN , First Publish Date - 2021-10-29T21:56:31+05:30 IST

పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఓ మంత్రి.. అసెంబ్లీకి వెళ్లిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంతి. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాగా.. ఇం

పాక్ 70ఏళ్ల చరిత్రలో సాధ్యం కానిది.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చేసి చూపించి, రికార్డు సృష్టించిదట!

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఓ మంత్రి.. అసెంబ్లీకి వెళ్లిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంతి. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాగా.. ఇంతకూ ఆయన ఏం చేశాడు.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సాధించిన ఆ ఘనత ఏంటి అనే వివరాల్లోకి వెళితే.. 


తారిక్ మసీహ్ అనే వ్యక్తి పంజాబ్‌లో పాకిస్థాన్ ముస్లీం లీగ్-ఎన్ (పీఎంఎల్-ఎన్) అనే పార్టీ తరఫున ఎన్నికల్లో విజయం సాధించాడు. ఆ పార్టీ పంజాబ్‌లో అధికారంలోకి రావడంతో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. ప్రస్తుతం పంజాబ్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన.. మెడలో కూరగాయల దండను ధరించి, సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లాడు. పూల దండ వేసుకున్నట్టు కూరగాయలను మెడలో ధరించి.. తారిక్ మహీస్.. సైకిల్‌పై వెళ్లడంపట్ల స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన కారణంగా తారిక్ మహీస్ ఇలా వినూత్న నిరసనకు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 



ఇదిలా ఉంటే.. 2018-21 మధ్య కాలంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగినట్లు స్థానిక మీడియా కథనాలను వెలువరించాయి. 2018లో కరెంటు బిల్లు యూనిట్‌కు రూ.4.06రూపాయలు ఉండేదని.. నాలుగేళ్ల కాలంలో యూనిట్ కరెంట్ ధర ఏకంగా 57శాతం పెరగడంతో ప్రస్తుతం 6.38 రూపాయలకు చేరినట్టు మీడియా సంస్థలు తెలిపాయి. కొన్ని ఆహార పదార్థాల ధరలు 100శాతంకిపైగా పెరిగాయని వెల్లడించాయి. 70ఏళ్ల పాకిస్థాన్ చరిత్రలో ద్రవ్యోల్బణం ఇంతలా పెరగడం ఇదే తొలిసారని తెలిపాయి. ద్రవ్యోల్బణంను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని మీడియా సంస్థలు ఆరోపించాయి. 




Updated Date - 2021-10-29T21:56:31+05:30 IST