Abn logo
Aug 13 2020 @ 15:45PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

లండన్:  రెండో టెస్ట్‌లో పాకీస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బ్యాటింగ్ ఎంచుకున్నట్లు పాక్ కెప్టెన్ అజార్ అలీ తెలిపాడు. షాదాబ్ ఖాన్ స్థానంలో ఫవాద్ ఆలమ్‌ను జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు. ఈ టెస్టులో ఇంగ్లాండ్ కూడా రెండు మార్పులను చేసింది. బెన్ స్టోక్స్ స్థానంలో జాక్ క్రాలీ ఆడనున్నాడు. అలాగే జోఫ్రా ఆర్చర్ బదులు శామ్ కుర్రన్ జట్టులోకి వచ్చాడు. మ్యాచ్‌కు శుక్రవారం నుంచి వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్-పాకీస్తాన్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలిచింది. బట్లర్, ఓక్స్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఈ విజయం సాధించింది. నేడు రెండో టెస్టు ప్రారంభమయింది. ఈ టెస్ట్‌లోనైనా గెలిచి సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని పాకీస్తాన్ చూస్తోంది.

Advertisement
Advertisement
Advertisement