Abn logo
Sep 28 2021 @ 13:24PM

Congressional report: పాకిస్థాన్ 12 ఉగ్రవాద సంస్థలకు నిలయం

అమెరికా సంచలన నివేదికలో వెల్లడి

వాషింగ్టన్: పాకిస్థాన్ దేశం ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరమని అమెరికాకు చెందిన స్వతంత్ర కాంగ్రెస్ పరిశోధనలో తేలింది. పాకిస్థాన్ దేశంలో 12 విదేశీ ఉగ్రవాద సంస్థలున్నాయని కాంగ్రెసేషనల్ రిపోర్టులో వెల్లడైంది.గత వారం జరిగిన చారిత్రాత్మక క్వాడ్ సమ్మిట్ సందర్భంగా యూఎస్ కాంగ్రెస్ ద్వైపాక్షిక పరిశోధన విభాగం విడుదల చేసిన నివేదికలో పాక్ లో ఉగ్రవాద సంస్థలున్నాయని తేలింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ 1980వ సంవత్సంలో ఏర్పడింది. 2001లో ఎఫ్టీవో అనే విదేశీ ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. 

భారతదేశంలోని ముంబై దాడులకు లష్కరేతోయిబా పాల్పడిందని నివేదిక తెలిపింది. కశ్మీరీ మిలిటెంట్ నాయకుడు మసూద్ అజహర్ 2000 వసంవత్సరంలో జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను నెలకొల్పాడు. హరాకత్ ఉల్ జిహాద్ ఇస్లామీ (హుజి) అనే సంస్థ 1980లో ఏర్పడింది. హుజీ సంస్థ ఉగ్రవాదులు అప్ఘాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్ లలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారు.హిజ్బుల్ ముజాహిదీన్ 1989లో ఏర్పడిన పాక్ మిలిటెంట్ వింగ్. అల్ జవహరి నేతృత్వంలో అల్ ఖైదా పనిచేస్తోంది. 

పాక్ ఉగ్రవాదులకు స్వర్గథామంగా కొనసాగుతోందని నివేదికలో వెల్లడైంది.పాకిస్తాన్ లోఉగ్రవాద గ్రూపులు అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్-ఖోరాసన్ ప్రావిన్స్, ఆఫ్ఘన్ తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్, తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, జుందల్లా (అకా జైష్ అల్-అడ్ల్), సిపా-ఇ-సహబా పాకిస్థాన్, లష్కరే-జాంగ్వి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నాయని అమెరికా తాజా నివేదికలో వెల్లడైంది. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...