అమితాబ్.. మీరు త్వరగా కోలుకోవాలి: షోయబ్ అక్తర్

ABN , First Publish Date - 2020-07-14T00:27:06+05:30 IST

బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన...

అమితాబ్.. మీరు త్వరగా కోలుకోవాలి: షోయబ్ అక్తర్

ఇస్లామాబాద్: బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను కరోనా బారిన పడిన విషయాన్ని అమితాబ్‌ స్వయంగా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని, అందుకోసం అల్లాను ప్రార్థిస్థున్నానని అన్నారు. ‘అమిత్ జీ.. మీరు త్వరగా కోలుకోవాలి. అందుకోసం ప్రార్థిస్తున్నా’ అంటూ ట్విటర్ ద్వారా షోయబ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమితాబ్ త్వరగా కోలుకోవాలని, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ తదితర క్రికెటర్లు కూడా ట్విటర్ వేదికగా ట్వీట్లు చేశారు.

Updated Date - 2020-07-14T00:27:06+05:30 IST