అలా మాట్లాడడానికి సిగ్గుపడను.. భారత్ విషయంలోనైనా..: అఫ్రిదీ

ABN , First Publish Date - 2020-08-03T00:53:18+05:30 IST

పాకీస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఇటీవల భారత ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు...

అలా మాట్లాడడానికి సిగ్గుపడను.. భారత్ విషయంలోనైనా..: అఫ్రిదీ

ఇస్లామాబాద్: పాకీస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఇటీవల భారత ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇటీవల అఫ్రిదీ మాట్లాడుతూ, కొన్ని విషయాలపై తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఏ మాత్రం సిగ్గుపడనని అన్నాడు. భారత్‌ గురించి మాట్లాడేందుకు కూడా వెనుకాడనని చెప్పాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మానవత్వమే అత్యున్నతమైందని, అందుకే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చేందుకు భయపడనని వెల్లడించాడు. ఇదిలా ఉంటే మే నెలలో అఫ్రిదీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ‘ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఓ ప్రాణాంతకమైన వ్యాధి వ్యాపిస్తోంది. అయితే అంతకంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ మనసు, ఆలోచనలు మరింత ప్రమాదకరమైనవి’ అంటూ ఆ వీడియోలో అఫ్రిదీ పేర్కొన్నాడు. దీనిపై క్రికెటర్ హర్బజన్ ఘాటుగా సమాధానమిచ్చాడు. అఫ్రిదీ హద్దు మీరి మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరికొందరు ఆటగాళ్లు కూడా అఫ్రిదీకి రాజకీయాలపై ఆసక్తి ఉంటే పాకీస్తాన్‌లో పోటీ చేయాలని, అంతేకానీ భారత రాజకీయాలలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు.

Updated Date - 2020-08-03T00:53:18+05:30 IST