బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుపై పాక్ రుసరుస!

ABN , First Publish Date - 2020-10-01T00:40:53+05:30 IST

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మొత్తం 32 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ...

బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుపై పాక్ రుసరుస!

ఇస్లామాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మొత్తం 32 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన తీర్పును ఖండిస్తున్నట్టు దాయాది దేశం పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ మీడియా సైతం భారత కోర్టు ఇచ్చే ఈ తీర్పుపై విశేష కవరేజి ఇచ్చింది. ఈ తీర్పు ‘‘తీవ్ర వివాదాస్పదం’’ అంటూ పెద్దఎత్తున కథనాలు ప్రసారం చేసింది. కాగా సీబీఐ కోర్టు తీర్పుపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం స్పందిస్తూ... ‘‘ఓ చారిత్రక మసీదును కూల్చివేసేందుకు కారణమైన వారిని నిర్దోషులుగా విడిచిపెట్టడం ‘సిగ్గుచేటు’. భారత్‌లోని మైనార్టీలు, ప్రత్యేకించి ముస్లింలు, వారి ప్రార్థనా స్థలాలకు రక్షణ, భద్రత కల్పించాలని పాకిస్తాన్ కోరుతోంది..’’ అని చెప్పు కొచ్చింది. అయితే పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలంటూ చురకలు వేసింది.

Updated Date - 2020-10-01T00:40:53+05:30 IST