Advertisement
Advertisement
Abn logo
Advertisement

చివర్లో నిలదొక్కుకున్న ఆఫ్ఘన్.. పాక్‌ ఎదుట ఓ మోస్తరు విజయ లక్ష్యం

దుబాయ్: పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పటికీ చివరి వరుస బ్యాట్స్‌మెన్ అద్భుతంగా పోరాడారు. పాక్ బౌలర్లను ఎదురొడ్డి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి పాక్ ఎదుట ఓ మోస్తరు విజయ లక్ష్యాన్ని ఉంచారు.


నజీబుల్లా జద్రాన్ (22), కెప్టెన్ మొహమ్మద్ నబీ (35), గులాబ్దిన్ నైబ్ (34) రాణించడంతో ఆప్ఘనిస్థాన్ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. ఓపెనర్ హజ్రతుల్లా జాజాయ్ డకౌట్ కాగా, మొహమ్మద్ షాజాద్ 8, రహమానుల్లా గుర్బాజ్ 10, అస్ఘర్ ఆఫ్ఘాన్ 10, కరీమ్ జనత్ 15 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ఇమాద్ వాసిం 2 వికెట్లు తీసుకోగా, షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement