ఉగ్రవాదులకు ప్రావిడెంటు ఫండ్లు.. పాక్‌పై భారత్ విసుర్లు!

ABN , First Publish Date - 2021-03-03T10:13:10+05:30 IST

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమాఖ్య వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్ మండిపడింది. 46వ సెషన్‌లో జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్‌పై భారత్ నిప్పులు చెరిగింది. టెర్రరిజాన్ని పాక్ పెంచి పోషిస్తోందని ఆరోపించింది.

ఉగ్రవాదులకు ప్రావిడెంటు ఫండ్లు.. పాక్‌పై భారత్ విసుర్లు!

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమాఖ్య వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్ మండిపడింది. 46వ సెషన్‌లో జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్‌పై భారత్ నిప్పులు చెరిగింది. టెర్రరిజాన్ని పాక్ పెంచి పోషిస్తోందని ఆరోపించింది. జమ్మూకశ్మీర్‌పై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసిన భారత్.. తమ దేశ పరిస్థితుల గురించి మాట్లాడే హక్కు పాక్‌కు లేదని తేల్చిచెప్పేసింది. మానవ హక్కులను ఉల్లంఘించి ఘోరమైన తప్పులు చేసిన పాకిస్తాన్ వాటిపై నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలామంది ఉగ్రవాదులకు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తమ ఖజానా నుంచి ప్రావిడెంట్ ఫండ్ అందించిందని చెప్పింది. ఇలా ఎన్నోసార్లు మానవ హక్కులను ఉల్లంఘించిన పాకిస్తాన్.. ఆ విషయాలను కప్పిపెట్టుకోవడానికి తమపై లేనిపోని అభాండాలు వేస్తోందని పేర్కొంది.

Updated Date - 2021-03-03T10:13:10+05:30 IST