పాక్ ప్రధాని సంచలన నిర్ణయం.. విమర్శలు గుప్పిస్తున్న కూటమి నేతలు

ABN , First Publish Date - 2022-06-06T02:16:03+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, పోస్టింగ్స్, ప్రమోషన్స్‌కు ముందు వారిని ఐఎస్ఐ (ISI)తో తనిఖీ చేయించాలన్న

పాక్ ప్రధాని సంచలన నిర్ణయం.. విమర్శలు గుప్పిస్తున్న కూటమి నేతలు

ఇస్లామాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, పోస్టింగ్స్, ప్రమోషన్స్‌కు ముందు వారిని ఐఎస్ఐ (ISI)తో తనిఖీ చేయించాలన్న పాక్ ప్రధానమంత్రి షేబాజ్ షరీఫ్ నిర్ణయంపై సొంత కూటమి నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఎస్ఐకి స్పెషల్ వెట్టింగ్ ఏజెన్సీ (SVA) హోదా కల్పిస్తూ పాక్ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కూటమి నేతల నుంచే కాదు, సొంత పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) నేతల నుంచి తీవ్ర విమర్శల వ్యక్తమవుతున్నాయి.

 

షరీఫ్ నిర్ణయంపై మండిపడుతున్న కూటమి పార్టీ నేతలు నిర్ణయం తీసుకోవడానికి ముందు తమతో ఒక్క మాట కూడా తీసుకోలేదని, పార్లమెంటుకు కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-06-06T02:16:03+05:30 IST