PAK NSA: ఆ మీటింగ్ కోసం భారత్ వెళ్ళను

ABN , First Publish Date - 2021-11-03T15:24:41+05:30 IST

భారత దేశం ఆతిథ్యమిస్తున్న ఆఫ్ఘనిస్థాన్‌పై

PAK NSA: ఆ మీటింగ్ కోసం భారత్ వెళ్ళను

ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్థాన్‌పై భారత దేశం నిర్వహిస్తున్న సమావేశానికి తాను హాజరు కాబోనని పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) మొయీద్ యూసఫ్ చెప్పారు. ఉజ్బెకిస్థాన్ ఎన్ఎస్ఏతో సమావేశమైన తర్వాత విలేకర్ల సమావేశంలో యూసఫ్ మాట్లాడారు. 


ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఆతిథ్యంలో నవంబరు 10-11 తేదీల్లో జరిగే సమావేశానికి హాజరవుతారా? అని ప్రశ్నించినపుడు యూసఫ్ స్పందిస్తూ, తాను హాజరుకాబోనని, ఓ వినాశకారి శాంతిని కాపాడే శక్తి కాబోదని అన్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో అందరికీ తెలుసునన్నారు. దీనిపై చర్చించవలసిన అవసరం లేదన్నారు. ఓ వైపు భారత దేశం ఉందని, దురదృష్టవశాత్తూ అక్కడి ప్రభుత్వ ప్రవర్తన, భావజాలం వల్ల ఈ శాంతి ప్రక్రియ ఏ విధంగా ముందుకెళ్తుందో తనకు తెలియదన్నారు. పాకిస్థాన్‌కు మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి శాంతి ప్రక్రియ ఏ విధంగా వస్తుందో తెలియదన్నారు. దురదృష్టవశాత్తూ ప్రపంచం కళ్ళు మూసుకుందని, భారత దేశంతో మాట్లాడవలసినవిధంగా ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి నెలకొంటే కనెక్టివిటీ కారిడార్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారత దేశానికి భద్రత సంబంధిత ఆందోళన అధికంగా ఉండటంతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ చొరవ తీసుకుని, ఈ ప్రాంతంలోని దేశాలతోపాటు, ప్రపంచ దేశాలతో వ్యక్తిగతంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు భారత దేశ జాతీయ భద్రతా మండలి సచివాలయం ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆఫ్ఘనిస్థాన్‌కు పొరుగున ఉన్న పాకిస్థాన్, ఇరాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలతోపాటు రష్యా, చైనా తదితర దేశాలకు కూడా ఆహ్వానాలు పంపించారు. 


Updated Date - 2021-11-03T15:24:41+05:30 IST