‘పుల్వామా’ పై నిస్సిగ్గుగా మాట మార్చేసిన పాకిస్తాన్

ABN , First Publish Date - 2020-10-30T17:59:31+05:30 IST

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని ప్రకటించి.... 24 గంటలైనా గడవలేదు... పాకిస్తాన్ అప్పుడే మాట మార్చేసింది. పైగా

‘పుల్వామా’ పై నిస్సిగ్గుగా మాట మార్చేసిన పాకిస్తాన్

శ్రీనగర్ : పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని ప్రకటించి.... 24 గంటలైనా గడవలేదు... పాకిస్తాన్ అప్పుడే మాట మార్చేసింది. పైగా బుకాయింపులకు దిగుతోంది. ఆ దాడితో తమకెలాంటి సంబంధమూ లేదని, తమ మాటలను వక్రీకరించారని మంత్రి ఫవాద్ ప్రకటించారు. పుల్వామా దాడి తర్వాత పరిస్థితులనే తాను ప్రస్తావించానని తెలిపారు. పుల్వామా దాడి తర్వాత భారత్ తో జరిగిన వైమానిక దాడి గురించే పరోక్షంగా ప్రస్తావించామని, అమాయకులను చంపి మేం ధైర్యవంతులమని ప్రకటించుకోవాలని తాము భావించడం లేదని అన్నారు. ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి ఫవాద్ తెలిపారు. 

సొంత గడ్డమీదే భారత్ ను దెబ్బకొట్టాం : మంత్రి ఫవాద్

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని సైన్స్, టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌధరి గురువారం ప్రకటించారు. ‘‘మనం భారత్ ను వారి గడ్డమీదే దెబ్బకొట్టాం. పుల్వామాలో మనం విజయం సాధించాం. ఇది ఇమ్రాన్ నేతృత్వంలోని పాక్ కు దక్కిన గెలుపు. ఈ విజయంలో మనమంతా భాగస్వాములమే.’’ అని ఫవాద్ పాక్ అసెంబ్లీలో తెలిపారు. 

Updated Date - 2020-10-30T17:59:31+05:30 IST