పాక్‌కు చైనా ఝలక్!.. టాప్ క్వాలిటీ అంటూ అండర్‌వేర్‌తో చేసిన మాస్కులు!

ABN , First Publish Date - 2020-04-05T01:23:13+05:30 IST

దాయాది దేశం పాకిస్తాన్‌కు చైనా పెద్ద ఝలకిచ్చింది. కరోనాపై పోరులో అండగా ఉంటామని చిలక పలుకులు పలికిన చైనా.. చివరికి పాక్‌ను నిండా ముంచేసింది.

పాక్‌కు చైనా ఝలక్!.. టాప్ క్వాలిటీ అంటూ అండర్‌వేర్‌తో చేసిన మాస్కులు!

ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌కు చైనా పెద్ద ఝలకిచ్చింది. కరోనాపై పోరులో అండగా ఉంటామని చిలక పలుకులు పలికిన చైనా.. చివరికి పాక్‌ను నిండా ముంచేసింది. నాణ్యమైన ఎన్95 ఫేస్‌మాస్కులు పంపుతామని చెప్పి, చివరకు లోదుస్తులతో చేసిన మాస్కులు పంపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా భయంతో ప్రపంచంలోని చాలా దేశాలు సరిహద్దులు మూసేసుకున్నాయి. వాటిలో పాకిస్తాన్ కూడా ఒకటి. అయితే కరోనాపై పోరాడటానికి సాయం చేస్తామన్న చైనా, ఒక్క రోజు సరిహద్దులు తెరిస్తే వైద్యపరికరాలను పంపిస్తామని చెప్పింది. ఈ మాటలు నమ్మిన పాక్.. చెప్పినట్లే సరిహద్దులు తెరిచింది. చెప్పినట్లే చైనా 2లక్షల సాధారణ మాస్కులు, 2వేల ఎన్‌95 మాస్కులు, 5 వెంటిలేటర్లు, 2వేల కరోనా టెస్టింగ్ కిట్లు, డాక్టర్లు వేసుకోవడానికి 2వేల మెడికల్ సూట్లు పంపించింది. అలా వచ్చిన వాటిని సింధ్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ బలగాలు సరిగా పరీక్షించకుండానే ఆస్పత్రులకు సరఫరా చేసేశాయి. అక్కడకు వచ్చిన తర్వాత చూస్తే ఏముంది? చైనా పంపిన బాక్సుల్లో లోదుస్తులతో చేసిన మాస్కులు కనిపించాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఖంగుతిన్నారు. ఈ ఘటన పాక్‌లో కలకలం రేపింది. టీవీ ఛానెళ్లలో కూడా దీని గురించి చర్చించుకున్నారు. మరి ఈ పరిణామంపై చైనా, పాక్ ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.

Updated Date - 2020-04-05T01:23:13+05:30 IST